Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేసులో శశి థరూర్
అక్టోబర్ 17న పార్టీ పదవికి ఎన్నిక
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పలువురు సీనియర్లు అసమ్మతి రాగం వినిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ కురువృద్దుడు , కేంద్ర మాజీ మంత్రి,, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ గుడ్ బై చెప్పాడు.
ఆయన వెళ్లి పోతూ సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటికే పార్టీలో జి23 పేరుతో అసమ్మతి రాగం వినిపించారు. ఆజాద్ వెళ్లడంతో ఆయన గ్రూపులో ప్రముఖంగా ఉన్న సీనియర్ నాయకుడు, కేరళ కు చెందిన రచయిత, ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) ఏఐసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఇదిలా ఉండగా తనంతకు తానుగా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో బరిలో నిలవాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయం గురించి మలయాళ దినపత్రిక మాతృభూమిలో ప్రత్యేక వ్యాసం రాశారు శశి థరూర్.
స్వేచ్ఛ, నిష్పాక్షిక ఎన్నికల కోసం తాను నిరీక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రస్తావించిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటి వరకు శశి థరూర్(Shashi Tharoor) అసమ్మతి నాయకుడిగా పేరొందారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలో గత కొన్నేళ్ల నుంచి గాంధీయేతర వ్యక్తులకు అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ పెరిగింది.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) లోని 12 స్థానాలకు కూడా ఎన్నికలను ప్రకటించి ఉండాల్సి ఉందని అభిప్రాయ పడ్డారు.
సంస్థాగత సంస్కరణలు కోరుతూ 2020లో ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల బృందంలో ఒకరుగా ఉన్నారు శశి థరూర్. తాజా అధ్యక్షుడిని ఎన్నుకోవడం కాంగ్రెస్ కు చాలా అవసరమని పేర్కొన్నారు తిరువనందపురం ఎంపీ.
Also Read : స్మృతీ ఇరానీ ఫోన్ చేసినా నో రెస్పాన్స్