Shashi Tharoor : అపరిప‌క్వ‌త‌తో కూడుకున్న నిర్ణ‌యం – థ‌రూర్

అనిల్ ఆంటోనీపై థ‌రూర్ కామెంట్స్

Shashi Tharoor : కేర‌ళ కాంగ్రెస్ లో రాజ‌కీయ దుమారం చెల‌రేగుతోంది. ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు ఏకే ఆంటోనీ త‌న‌యుడు అనిల్ కే ఆంటోనీ పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతే కాదు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ద్వేషం వ‌ద్దంటూనే ప్ర‌ధాన మంత్రి మోడీని ఎందుకు ద్వేషిస్తున్నారంటూ పేర్కొన్నారు.

దీనిని సాకుగా చూపిస్తూ అనిల్ కే ఆంటోనీ పార్టీకి, ఇత‌ర ప‌ద‌వుల‌కు గుడ్ బై చెప్పారు. విచిత్రం ఏమిటంటే అనిల్ కే ఆంటోనీ తిరువ‌నంత‌పురం ఎంపీ, ప్ర‌ముఖ ర‌చ‌యిత శ‌శి థ‌రూర్(Shashi Tharoor) వ‌ర్గానికి చెందిన వాడిగా ముద్ర ప‌డ్డారు. విచిత్రం ఏమిటంటే ప్ర‌ధాని మోడీపై బీబీసీ సీరీస్ టెలికాస్ట్ చేసింది.

దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం కొన‌సాగుతోంది. ఇందుకు సంబంధించిన లింకుల‌ను వెంట‌నే తీసి వేయాల‌ని ఆదేశించింది కేంద్రం. ఈ త‌రుణంలో మోదీకి వ‌త్తాసు ప‌లుకుతూ అనిల్ కే ఆంటోనీ రాజీనామా చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు ఎంపీ శ‌శి థ‌రూర్. ఆంటోనీ చేసిన వ్యాఖ్య‌లు స‌మ‌ర్థ‌నీయం కాద‌ని పేర్కొన్నారు.

ఇది పూర్తిగా అవ‌గాహ‌న లేక పోవ‌డం, అప‌రిప‌క్వ‌త‌తో కూడిన నిర్ణ‌యంగా కొట్టి పార‌స్త్రశారు శ‌శి థ‌రూర్(Shashi Tharoor). ఏదైనా ఉంటే పార్టీలో తేల్చుకోవాలి కానీ బీబీసీ టెలికాస్ట్ చేసిన స్టోరీని ప్రాతిప‌దిక‌గా చేసుకుని పార్టీని వ‌దిలి వేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. దీనికి ఎన్నో మార్గాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

బీబీసీ డాక్యుమెంట‌రీ వ‌ల్ల మోడీకి క‌లిగే న‌ష్టం ఏమిటో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. ఈ విష‌యం కేంద్రం, బీజేపీ చెప్పాల‌ని సెటైర్ వేశారు శ‌శి థ‌రూర్.

Also Read : బీజేపీకి షాక్ ఒడిశా మాజీ సీఎం గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!