Shashi Tharoor Congress Polls : వచ్చే ఎన్నికలపై చెప్పలేను – థరూర్
ఎంపీ శశి థరూర్ షాకింగ్ కామెంట్స్
Shashi Tharoor Congress Polls : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల గురించి తాను ఏమీ చేయలేనని పేర్కొన్నారు. ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో జరగనున్న కాంగ్రెస్ ప్లీనరీ సెషన్ పై కీలక వ్యాఖ్యలుచేశారు ఎంపీ. ఈ సందర్భంగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదా అన్నది ఇప్పుడు చెప్పలేనన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని శశి థరూర్ వాస్తవంగా తోసి పుచ్చారు.
ఏఐసీసీ చీఫ్ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత తాను తదుపరి ఎన్నికల(Shashi Tharoor Congress Polls) గురించి ఆలోచించడం లేదన్నారు. ఇందుకు సంబంధించి ఇతరులు ముందడుగు వేయాలన్నారు. సీడబ్ల్యూసీ ఎన్నికలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించుకుంటే పోటీ చేసే ఆలోచన గురించి తాను పట్టించుకోనని స్పష్టం చేశారు శశి థరూర్.
ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో తమ పార్టీ ముందంజలో ఉందన్నారు. కానీ కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ.
ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలు బాగానే ఉన్నా ఎందుకని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. భవిష్యత్తు కోసం సవాళ్ల పరంగా పార్టీ తీవ్ర సమస్యను ఎదుర్కొంటోందన్నారు.
పార్టీ కోసం నేనే ఒక ఎన్నికల్లో పాల్గొన్నాను. ఇప్పుడు నేను ఓడి పోయాను. దాని గురించి ఆలోచించడం మానేశానని స్పష్టం చేశారు శశి థరూర్. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : 840 ఫ్లైట్స్ కు ఎయిర్ ఇండియా ఆర్డర్