Shashi Tharoor Viral : మేడంతో శశి థరూర్ ముచ్చట
ఏఐసీసీలో అరుదైన సన్నివేశం
Shashi Tharoor Viral : శశి థరూర్ కాంగ్రెస్ పార్టీలో ఐకానిక్ లీడర్ గా ఉన్నారు. రాజకీయ నాయకుడు, రచయిత, వక్త, మెంటార్ కూడా. భిన్నమైన అభిప్రాయాలను అలవోకగా పంచుకునే నైపుణ్యం కలిగిన ఎంపీగా గుర్తింపు పొందారు. గతంలో పాలమూరు జిల్లాకు చెందిన ఎంపీ , దివంగత కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి అనర్ఘలంగా ప్రసంగించేవారు.
ఆయన కొత్త కొత్త పదాలు వాడితే జర్నలిస్టులు, మేధావులు సైతం విస్తు పోయిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో జైపాల్ రెడ్డి సోనియగాంధీని ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. కానీ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నేతలలో ఇప్పుడు శశి థరూర్(Shashi Tharoor) కీలకంగా మారారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తిరువనంతపురం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న థరూర్ పోటీ చేశారు. వేయికి పైగా ఓట్లను సాధించి విస్తు పోయేలా చేశారు. ఆయన ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై రాసిన పుస్తకం కలకలం రేపుతోంది. శశి థరూర్ మల్లికార్జున్ ఖర్గే చేతిలో ఓటమి పాలయ్యారు.
ఆయన ప్రధానంగా పార్టీలో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా పోటీ చేసినప్పుడు, ఓటు వేసినప్పుడు మాత్రమే ఉంటుందని గుర్తు చేశారు. అందుకే తాను బరిలో ఉన్నానని ప్రకటించారు కూడా. బుధవారం న్యూఢిల్లీలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.
ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శశి థరూర్ ఖర్గేతో పాటు సోనియా గాంధీతో ముచ్చటించడం ఆసక్తిని రేపింది. ప్రస్తుతం ఈ ఫోటో ట్విట్టర్ లో హల్ చల్ చేస్తోంది.
Also Read : థరూర్ ‘అంబేద్కర్’ కలకలం