Shashi Tharoor : స్నేహం పదిలం బరిలో ప్రత్యర్థులం
నిన్న స్నేహితులు నేడు కత్తులు
Shashi Tharoor : దేశంలో మోస్ట్ పాపులర్ పర్సన్ గా మారి పోయారు కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Shashi Tharoor). ఆయన వక్త, రచయిత, స్నేహశీలి. అందరితో కలివిడిగా ఉంటారు. ఆపై నిత్యం చర్చకు దారితీసేలా శశిథరూర్ ట్వీట్స్ తో హోరెత్తిస్తుంటారు. ఒక రకంగా మేధావుల జాబితాలో ఆయన కూడా ఒకరుగా ఉన్నారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీలో దేశ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయన ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా ఏం మాట్లాడినా లేదా ఎవరితో కలిసినా అది సంచలనంగా మారింది. ఆపై సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. ఈ తరుణంలో తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధ్యక్ష స్థానానికి అక్టోబర్ 17న ఎన్నిక జరగనుంది.
ఇందుకు గాను గాంధీ ఫ్యామిలీకి విధేయుడైన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఇవాళ కొత్త పేరు ముందుకు వచ్చింది. మధ్య ప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పేరు బయటకు వచ్చింది. గురువారం ఆయన మేడం సోనియా గాంధీని కలుసుకున్నారు.
ఆ తర్వాత సెప్టెంబర్ 30న నామినేషన్ దాఖలు చేస్తానని ప్రకటించారు. ఈ తరుణంలో రెబల్ అభ్యర్థిగా శశి థరూర్ బరిలో ఉండనున్నారు. ఇదిలా ఉండగా ఉన్నట్టుండి శశి థరూర్ తనకు పోటీగా నిలవబోయే డిగ్గీ రాజాను స్వయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తనను ప్రత్యేకంగా అభినందించారు. పోటీ సహజమేనని తామిద్దరం స్నేహితులమని స్పష్టం చేశారు శశి థరూర్.
Also Read : సోనియా గాంధీకి గెహ్లాట్ క్షమాపణ