Shashi Tharoor : సోనియా గాంధీని కలిసిన శశి థరూర్
పార్టీలో సంస్కరణలు రావాలని లేఖ
Shashi Tharoor : సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏకైక పార్టీగా కాంగ్రెస్ కు పేరుంది. వచ్చే అక్టోబర్ 17న ఆ పార్టీకి సంబంధించి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి.
గాంధీ ఫ్యామిలీకి సంబంధించి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా ఎన్నికల బరిలో ఉంటారా లేక గాంధీ ఫ్యామిలీని వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకులలో ఎవరు పోటీ చేస్తారనేది ఆ పార్టీలో ఉత్కంఠ రేపుతోంది.
ఈ తరుణంలో గత కొంత కాలం నుంచీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా పోయందని, రేపు నిర్వహించ బోయే ఎన్నికలలో పారదర్శకంగా ఉంటాయో లేవోనన్న ఆందోళనను వ్యక్తం చేస్తూ వచ్చారు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ , శశి థరూర్(Shashi Tharoor) , తదితరులు.
కానీ ఉన్నట్టుండి రాజ్యసభ ఎన్నికల కంటే ముందే కపిల్ సిబల్ గుడ్ బై చెప్పారు. ఆపై రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ మాజీ కేంద్ర మంత్రి, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు.
ఈ తరుణంలో జి23 సదస్సు నిర్వహించి అసంతృప్తి వాదులుగా గుర్తింపు పొందిన వారిలో తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఒకరు. ఆయన రచయిత, మేధావి దేశ వ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు.
ఆయనకు ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే కాదు అన్ని పార్టీలలో కూడా మిత్రులు ఉన్నారు. ఇదే తరుణంలో మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏకగ్రీవంగా పార్టీ చీఫ్ ను ఎన్నుకుంటే బావుంటుందన్నారు. ఈ తరుణంలో పార్టీలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వచ్చిన శశి థరూర్ సోమవారం పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi)తో కలిశారు.
ప్రస్తుతం వారిద్దరూ ఏం మాట్లాడారనే దానిపై చర్చ కొనసాగుతోంది పార్టీ వర్గాలలో.
Also Read : ఆప్ నేతకు సమన్లపై మనీష్ సీరియస్