Shashi Tharoor : మోదీ సర్కార్ పై థరూర్ సెటైర్
కౌ హగ్ డే పై కాంగ్రెస్ ఎంపీ కామెంట్స్
Shashi Tharoor : ఫిబ్రవరి 14న ప్రతి ఒక్కరు కౌ హగ్ డే (ఆవులను కౌగిలించు కోవడం ) జరుపు కోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు , సోషల్ మీడియాలో మీమ్స్ చోటు చేసుకోవడంతో గత్యంతరం లేక తాను తీసుకున్న నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై దుమారం చెలరేగడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ సీరియస్ గా స్పందించారు. ఆయన మోదీ బీజేపీ సర్కార్ పై మండిపడ్డారు. ఒక రకంగా జోకులు పేల్చారు.
దేశంలో ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియడం లేదు అని చెప్పేందుకు ఈ కౌ డేను జరపమని అని పేర్కొన్నారు. జోక్స్ తో కౌగిలించాలా అని సెటైర్ వేశారు. కౌ హగ్ డే ను కేంద్రం ఉపసంహరించు కోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ సందర్భంగా శశి థరూర్(Shashi Tharoor) మాట్లాడారు. వారు తమ వ్యక్తిని కౌగిలించు కోనివ్వండని పేర్కొన్నారు. కానీ గే అని తప్పుగా అర్థం చేసుకోవచ్చని హెచ్చరించారు.
శనివారం ఎంపీ శశి థరూర్ ఆసక్తికరమైన ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియాలో సైతం జోకులు, మీమ్స్ పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. అందరి నుంచి వస్తున్న దాడిని తట్టుకోలేక కేంద్రం కౌ హగ్ డేను ఉపసంహరించుకుంది.
ఎంపీ ఇవాళ బంద్ వాగన్ లో చేరారు. కౌ హగ్ డే పై తన హాస్య భరితమైన కామెంట్స్ చేయడం విస్తు పోయేలా చేసింది. ప్రేమికుల రోజున ఆవులను కౌగిలించు కోవాలా అని ప్రశ్నించారు ఎంపీ.
Also Read : ఆప్ కు షాక్ నామినీలు తొలగింపు