Shashi Tharoor : రాహుల్ ఎందుకు క్షమాపణ చెప్పాలి
నిలదీసిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Shashi Tharoor Rahul : కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన పార్టీ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీకి మద్దతు పలికారు. గత కొంత కాలంగా రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ కేంద్రం డిమాండ్ చేస్తోంది. కేంబ్రిడ్జి యూనివర్శిటీలో రాహుల్ గాంధీ అనని మాటలను అన్నట్టు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు శశి థరూర్. కావాలని టార్గెట్ చేయడం మంచి పద్దతి కాదన్నారు.
రాజకీయాలు చేయడంలో , అబద్దాలను ప్రచారం చేయడంలో ముందంజలో ఉందని ఎద్దేవా చేశారు. ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. ఈ దేశాన్ని దోచుకుంటున్నది ఎవరు. అబద్దాలు చెప్పింది ఎవరు..2014లో ఆచరణకు నోచుకోని హామీలను ఇచ్చి మోసం చేసినందుకు ప్రధాన మంత్రి, ఆయన కేబినెట్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ లో వాస్తవం ఉందన్నారు. కానీ ఆయన చెప్పిన దానిని తప్పుగా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు శశి థరూర్. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని మాత్రమే రాహుల్ గాంధీ అన్నారని పేర్కొన్నారు. ఇందులో వాస్తవం ఉందని తాను పూర్తిగా రాహుల్ గాంధీ మాటలను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్దతి కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
ఓ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో శశి థరూర్ (Shashi Tharoor Rahul) మాట్లాడారు. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పే ప్రసక్తి లేదన్నారు. విదేశీ గడ్డపై రాజకీయాలు మాట్లాడిన విషయంలో క్షమాపణ చెప్పాల్సి వస్తే ప్రధాని మోదీనే ముందుగా సారీ చెప్పాలని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఎలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదన్నారు.
Also Read : మోదీ గురించి అలా అనలేదు