Shatrughan Sinha : కాంగ్రెస్ పై కీలక కామెంట్స్ చేశారు టీఎంసీ ఎంపీ అభ్యర్థి శత్రుఘ్న సిన్హా. దేశంలో ఆక్టోపస్ లా అల్లుకు పోయిన బీజేపీని, సమర్థవంతమైన నాయకుడిగా పేరొందిన నరేంద్ర మోదీని ఢీకొనే సత్తా ఒక్క మమతా బెనర్జీకి తప్ప మరొకరికి లేదన్నారు.
సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోందన్నారు. గతంలో శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
ఆ తర్వాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. లోక్ సభ ఉప ఎన్నికలో సిన్హాకు ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చింది టీఎంసీ చీఫ్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మోదీని ఒకే ఒక్క నాయకురాలు ఢీకొందని అన్నారు.
దేశమంతటా మోదీ త్రయం ( మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ) వెంటాడినా, వేధింపులకు గురి చేసినా ఎక్కడా తగ్గలేదన్నారు. బీజేపీకి ఊహించని రీతిలో షాక్ ఇచ్చిందన్నారు శత్రుఘ్న సిన్హా. ఎక్కువ కాలం వేధింపు రాజకీయాలు పని చేయవని చెప్పారు.
భవిష్యత్తులో ఈ దేశానికి నాయకత్వం వహించే సత్తా తమ పార్టీకి, దీదీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. తాను ఎందుకు కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందనే దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శత్రుఘ్న సిన్హా (Shatrughan Sinha )అసన్సోల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. మమతా బెనర్జీ తన సేవలను గుర్తించింది. పార్టీలోకి రమ్మని కోరింది. నేను కాదనలేక పోయానన్నారు సిన్హా.
అయితే సిన్హా మాత్రం కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదన్న రీతిలో కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
Also Read : ఎంపీ పదవికి భగవంత్ మాన్ రిజైన్