Shahbaz Sharif : పాకిస్తాన్ లో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభానికి తెర పడింది. అవిశ్వాస తీర్మానంలో 2 ఓట్ల తేడాతో పవర ను కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
ఆయన ప్రతిపక్షాలను దొంగలు అంటూ సంబోధించారు. అంతే కాదు వారి పక్కన తాము కూర్చోబోమంటూ ప్రకటించారు.
మూకుమ్మడిగా రాజీనామా సమర్పించారు పీటీఐ సభ్యులు. ఆయనను అవినీతి ఆరోపణలు చుట్టు ముట్టాయి.
ఏకంగా ఏడేళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించారు. షెహబాజ్ షరీఫ్ కు ముగ్గురు భార్యలు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు ఆయన సీఎంగా ఉన్న సమయంలో లాహోర్ లో ఐదుగురు విద్యార్థులను బూటకపు ఎన్ కౌంటర్ లో చంపేందుకు ఆదేశించినట్లు కూడా ఆరోపణలున్నాయి.
ఇక లాహోర్ లోని ఫ్లై ఓవర్ కి హనీ బ్రిడ్జి అని పేరు పెట్టారు. దీని వెనుక ఓ కథ ఉంది. షెహబాజ్ షరీఫ్(Shahbaz Sharif) పంజాబ్ సీఎంగా ఉన్న సమయంలో దీనిని నిర్మించారు.
ఇది షెహబాజ్ తన రెండో భార్య ఆఫీసు నుంచి ఆలస్యంగా ఇంటికి రాకూడదని తయారు చేశాడంటూ విమర్శలు ఉన్నాయి. 2001లో జరిగింది. ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసి పాకిస్తాన్ ను ఏడేళ్ల పాటు స్వయం ప్రవాసంలో ఉంచారు.
దీంతో సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ ఆశ్రయం పొందాడు. అక్కడి నుంచి పాకిస్తాన్ కు వచ్చే సమయంలో మూడో భార్యతో వచ్చాడు. 1998లో చంపబడిన విద్యార్థులకు సంబంధించిన కేసులో షెహబాజ్ తో సహా 13 మందిపై కేసు నమోదు చేశారు.
ఇక పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీ కూడా నవాజ్ షరీఫ్, షెహబాజ్ షరీఫ్ (Shahbaz Sharif) తనను రెండు సార్లు హత్య చేయాలని ప్లాన చేశారని ఆరోపించాడు.
ప్రస్తతం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న షెహబాజ్ షరీఫ్ ఇప్పుడు పాకిస్తాన్ కు కాబోయే ప్రధాన మంత్రి కావడం విశేషం.
Also Read : పాకిస్తాన్ కు రానున్న నవాజ్ షరీఫ్