Shehzad Poonawalla : బడులు అడిగితే వైన్ షాపులు తెరిచారు
ఆప్ సర్కార్ పై బీజేపీ అధికార ప్రతినిధి ఫైర్
Shehzad Poonawalla : ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. లిక్కర్ పాలసీ స్కాంకు సంబంధించి ఇప్పటికే సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.
డిప్యూటీ సీఎంతో పాటు 14 మంది ఉన్నతాధికారులపై అభియోగాలు మోపింది. మంగళవారం సీబీఐ మనీష్ సిసోడియాకు సంబంధించిన బ్యాంకు లాకర్ ను తెరిచి సోదాలు చేపట్టింది.
రూ. 70,000 వేల రూపాయల ఆభరణాలు తప్ప ఇంకేమీ దొరకలేదని ప్రకటించారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా స్పందించారు.
ఆప్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఢిల్లీ ప్రజలు పాఠశాలలు కావాలని కోరితే ఆప్ సర్కార్ మధుశాలలు తెరిచిందని ఎద్దేవా చేశారు. మంగళవారం పూనావాలా(Shehzad Poonawalla) మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీలో మద్యం ఏరులై పారుతోంది. విద్య పేరుతో అవినీతి, అక్రమాలకు తెర లేపారని ఆరోపించారు. మద్యం, విద్య కుంభకోణాలు అవినీతికి జంట టవర్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం క్రమంగా మరిన్ని అంతస్తులను నిర్మిస్తోందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం తరగతి గదుల నిర్మాణ ఖర్చులను సమర్థించిందని ఆరోపించారు.
ఆప్ ప్రభుత్వం రివర్స్ రాబిన్ హుడ్ మోడల్ ను అనుసరిస్తోందన్నారు. అందులో పేదలకు ఉద్దేశించిన డబ్బును మద్యం మాఫియా ఖజానా నింపేందుకు తీసుకు వెళుతున్నారని విమర్శించారు.
ఇదిలా ఉండగా టౌటర్ ఢిల్లీ లోని నాంగ్లోయ్ లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని తరగతి గది లోని సీలింగ్ ఫ్యాన్ తలపై పడడంతో గాయపడిన సంఘటనను ఎంపీ మనోజ్ తివారీ ఉదహరించారు.
Also Read : శశి థరూర్ కామెంట్స్ కలకలం