Shelly Oberoi Win : ఢిల్లీ మేయ‌ర్ గా షెల్లీ ఒబెరాయ్

గూండాలు ఓడి పోయార‌న్న ఆప్

Shelly Oberoi Win : ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ కొత్త మేయ‌ర్ గా ఎన్నిక‌య్యారు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన రేఖా గుప్తాను 34 ఓట్ల తేడాతో ఓడించింది. మూడుసార్లు ర‌ద్దు చేయాల్సి వ‌చ్చింది ఎన్నిక‌ల‌ను. మొత్తం పోలైన 266 ఓట్ల‌లో షెల్లీ ఒబారాయ్ కు 150 ఓట్లు వ‌చ్చాయి. రేఖా గుప్తాకు 116 ఓట్లు వ‌చ్చాయి. తాజాగా షెల్లీ ఒబెరాయ్(Shelly Oberoi Win) ఢిల్లీ కొత్త మేయ‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. సుప్రీంకోర్టులో ఆప్ నిర్ణ‌యాత్మ‌క విజ‌యం సాధించింది.

ఈ సంద‌ర్బంగా త‌మ పార్టీకి చెందిన వ్య‌క్తికి మేయ‌ర్ గా ఎన్నిక కావ‌డంపై స్పందించారు ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ , డిప్యూటీ చీఫ్ మ‌నీష్ సిసోడియా స్పందించారు. బుధ‌వారం సీఎం , డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. గూండాలు ఓడి పోయారు. ప్రజానీకం గెలిచింది. ఇవాళ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో ఢిల్లీ ప్ర‌జ‌లు గెలిచార‌ని అన్నారు. గూండాయిజం ఓడి పోయింద‌న్నారు. డిసెంబ‌ర్ లో జ‌రిగిన పౌర ఎన్నిక‌లు ఆప్ గెలిచిన‌ప్ప‌టి నుండి ఆప్ , బీజేపీ మ‌ధ్య సుదీర్గ పోరు న‌డుస్తోంది.

వాయిదా ప‌డ‌డంతో చివ‌ర‌కు ఆప్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై విచారించిన కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఎల్జీకి ఎలాంటి ప్ర‌మేయం లేద‌ని తెలిపింది. ఎల్జీ చేసిన నామినేట్ చేసిన 10 మంది స‌భ్యుల ఎంపిక చెల్లుబాటు కాదంటూ స్ప‌ష్టం చేసింది. సీజేఐ చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం కీల‌క తీర్పు చెప్పింది. చివ‌ర‌కు ఆప్ గెలుపొందింది. ఒక ర‌కంగా బీజేపీకి బిగ్ షాక్ .

Also Read : అస్సాం ఎమ్మెల్యేకు సుప్రీం ఊర‌ట

Leave A Reply

Your Email Id will not be published!