Shiv Nadar Top : దాన సంప‌న్నులు శివ నాడ‌ర్..ప్రేమ్ జీ

భార‌తీయ దాత‌ల్లో టాలో ఆ ఇద్ద‌రు

Shiv Nadar Top : ఈ దేశంలో వేలాది మంది వ్యాపారులు, ఇత‌ర రంగాల‌కు చెందిన వారు ఉన్నారు. క‌రోడ్ ప‌తులు , కార్పొరేట్ దిగ్గ‌జాలు లెక్కించ లేనంత మంది. కానీ దాతృత్వంలో మాత్రం కొంద‌రే త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. వారిలో మొద‌ట‌గా చెప్పుకోవాల్సింది త‌మిళ‌నాడుకు చెందిన శివ నాడ‌ర్.

ఆయ‌న తాను సంపాదించిన దాంట్లో అత్య‌ధికంగా దాతృత్వం చేసేందుకే కేటాయిస్తారు. దేశ చ‌రిత్ర‌లో ఇది ఒక రికార్డుగా చెప్పుకోవ‌చ్చు. శివ నాడ‌ర్ ఎవ‌రో కాదు ప్ర‌ముఖ ఐటీ కంపెనీగా పేరొందిన హెచ్ సీ ఎల్ కంపెనీకి చైర్మ‌న్(Shiv Nadar Top) . వ్య‌వ‌స్థాప‌కుడు కూడా . ఆయ‌న రోజుకు రూ. 3 కోట్ల రూపాయ‌లు దానం చేస్తున్నారంటే న‌మ్మ‌గ‌ల‌మా.

ఈ ఏడాది లో ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 1,161 కోట్లు దానంగా ఇచ్చారు. ఇక రెండ‌వ స్థానంలో విప్రో సంస్థ‌ల అధిప‌తి అజీమ్ ప్రేమ్ జీ నిలిచారు. ఆయ‌న రూ. 484 కోట్లు విరాళంగా స‌మ‌ర్పించారు. ఈ మేర‌కు ఎవ‌రెవ‌రు ఎంతెంత ఇచ్చార‌నే దానిపై ఎడెల్ గివ్ హురున్ ఇండియా ఫిలాంథ్ర‌పీ లిస్ట్ విడుద‌ల చేసింది 2022కు గాను.

గ‌డిచిన మూడు సంవ‌త్స‌రాల కాలంలో ఏకంగా రూ. 3,219 కోట్లు విరాళంగా ఇచ్చారు. గ‌డిచిన మూడు సంవ‌త్స‌రాల‌లో రూ. 18,101 కోట్లు ఇచ్చారు. రిల‌య‌న్స్ చైర్మ‌న్ ముకేశ్ అంబానీ రూ. 411 కోట్లు, ఆదిత్యా బిర్లా గ్రూపు రూ. 242 కోట్లు విరాళంగా ఇచ్చారు. మొత్తంగా సంపాదించ‌డం వేరు వాటిని స‌రైన వారికి సాయం చేయ‌డం వేరు. ఇందులో శివ నాడ‌ర్ , ప్రేమ్ జీని మెచ్చుకోకుండా ఉండ‌లేం.

Also Read : ముకేశ్ అంబానీయా మ‌జాకా

Leave A Reply

Your Email Id will not be published!