Shiv Pal Yadav : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన భార్య తో కలిసి ఓటు వేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు.ఈసారి రైతులు, అన్ని వర్గాల బాధితులు, బహుజనులు, మైనార్టీలంతా తమ వైపు ఉన్నారని స్పష్టం చేశారు. ఆ మేరకు తామే అధికారంలోకి రాబోతున్నామంటూ ధీమా వ్యక్తం చేశౄరు.
ఇదిలా ఉండగా అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివ పాల్ యాదవ్(Shiv Pal Yadav) సమాజ్ వాది అగ్ర నేత ములాయం సింగ్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ్ముడిని చూసి పరవశించి పోయారు అన్న ములాయం. ఆయనను ఆశీర్వదించారు.
వీరిద్దరూ చాలా సేపు ముచ్చటించారు. పలు అంశాలపై చర్చించారు. అనంతరం శివ పాల్ యాదవ్(Shiv Pal Yadav) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాము కచ్చితంగా పవర్ లోకి వస్తామన్నారు. గెలవడం ఖాయమని కానీ మెజారిటీ ఎంత అన్నది ఇప్పుడే చెప్ప లేమన్నారు. వేవ్ చూస్తే ప్రజలు తమ వైపు ఉన్నారని తేలిందన్నారు.
ప్రధానంగా తమ తనయుడు అఖిలేష్ యాదవ్ అద్భుతంగా పని చేస్తున్నాడంటూ కితాబు ఇచ్చాడు. పెద్ద ఎత్తున రాష్ట్ర మంతటా పర్యటించారని, ప్రజలు అఖిలేష్ ను దీవించడం ఖాయమని జోస్యం చెప్పారు శివ పాల్ యాదవ్.
దాదాపు 300 సీట్లకు పైగానే వస్తాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. కాగా ఈఠ్వా లోని జస్వంత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివ పాల్ యాదవ్ పోటీలో ఉన్నారు.
Also Read : పంజాబ్ లో శాంతి భద్రతలు ముఖ్యం