Shiv Sena : బాల్ ఠాక్రే పేరు వాడితే బాగుండదు
కీలక నిర్ణయాలకు శివసేన తీర్మానం
Shiv Sena : మహారాష్ట్రలో నెలకొన్న సంక్షోభం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ మేరకు రెబల్స్ తగ్గడం లేదు. వారంతా గౌహతిలోని రాడిసన్ హోటల్ లో మకాం వేశారు. డిప్యూటీ స్పీకర్ శివసేన పార్టీ(Shiv Sena) నియమ నిబంధనలు ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ చేశారు.
ఇక అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలన్నా లేదా ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా పూర్తి అధికారాలు మాత్రం కేవలం స్పీకర్ కే ఉంటుంది. దీంతో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కీలకంగా మారనున్నారు.
ఈ మేరకు పార్టీ చీఫ్ , సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇప్పటికే ధిక్కార స్వరం వినిపించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు. ముఖ్యమంత్రి విన్నపానికే మొగ్గు చూపారు డిప్యూటీ స్పీకర్.
ఈ మేరకు శివసేన పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ఈ భేటీలో ఆరు తీర్మానాలను ఆమోదించింది. ప్రత్యేకించి శివసేన పార్టీ తప్ప ఇంకెవరూ మరాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే పేరును వాడ కూడదంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నట్లు తెలిపింది. బాలా సాహెబ్ పేరును కేవలం శివసేన కు మాత్రమే ఉందన్నారు ఉద్దవ్ ఠాక్రే.
ధిక్కార స్వరం వినిపించిన శివసేన ఎమ్మెల్యేలపై నిప్పులు చెరుగుతున్నారు శివసేన పార్టీకి చెందిన శ్రేణులు. ఇప్పటికే వారి ఇళ్లు, ఆఫీసులపై దాడులకు పాల్పడ్డారు.
దీంతో ముంబైలో వచ్చే నెల 10 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు సీపీ. 16 మంది ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు పంపారు శివసేన(Shiv Sena) చీప్ విప్ సునీల్ ప్రభు. సోమవారం సాయంత్రం 5 గంటల లోపు సమాధానం ఇవ్వాలని కోరారు.
Also Read : శివసేన ఎవరికీ తలవంచదు – రౌత్