Priyanka Chaturvedi : రెబల్స్ ఆశలు ఫలించవు – ప్రియాంక
నిప్పులు చెరిగిన శివసేన ఎంపీ చతుర్వేది
Priyanka Chaturvedi : మహారాష్ట్ర సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఓ వైపు ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్స్ ఇంకో వైపు ఉద్దవ్ ఠాక్రే సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
అస్సాం లోని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ లో బస చేసిన శివసేన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా టీఎంసీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ తమకు కేంద్రంలోని బీజేపీ నాయకత్వం సపోర్ట్ ఉందంటూ ఇప్పటికే ప్రకటించారు శివసేన పార్టీ నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే.
ఈ మొత్తం వ్యవహారంపై శివసేన జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్ చేశారు. వారికి ఇప్పటి వరకు చాన్స్ ఇచ్చామని అన్నారు.
అంతే కాదు వెళ్లిన వాళ్లు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఎంతో ఓపికతో శివసేన సైనికులు వేచి ఉన్నారని, వారింకా రోడ్ల మీదకు రాలేదని హెచ్చరించారు.
కాగా తాజాగా చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై ఎంపీ ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi) స్పందించారు. తాము శివ సైనికులమని , పోరాడి గెలుస్తామని చెప్పారు.
శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రెబల్ శివసేన ఎమ్మెల్యేలు చేస్తున్నది పూర్తిగా చట్ట వ్యతిరేకం. వారు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు.
అది రాజకీయంగా ఆచరణ సాధ్యం కాదని కుండ బద్దలు కొట్టారు. ఇప్పుడే కాదు గతంలో కూడా జరిగింది. కానీ అన్నీ ఫలించిన దాఖలాలు లేవన్నారు ప్రియాంక. ఈసారి కూడా అది సాధ్యం కాదన్నారు ఎంపీ.
Also Read : నిధుల దుర్వినియోగంపై శ్వేతపత్రం – సీఎం