Narendra Bhondekar : ఘ‌నంగా రెబ‌ల్ ఎమ్మెల్యే బ‌ర్త్ డే

షిండే క్యాంపులో కార్య‌క్ర‌మం

Narendra Bhondekar : ఓ వైపు మ‌హారాష్ట్ర సంక్షోభం కొన‌సాగుతుండ‌గా ఇంకో వైపు ఫుల్ జోష్ లో కొన‌సాగుతోంది శివ‌సేన‌పై ధిక్కార స్వ‌రం వినిపించిన ఏక్ నాథ్ షిండే వ‌ర్గం. ఈ మేర‌కు అస్సాం లోని గౌహ‌తి రాడిసన్ బ్లూ హోట‌ల్ లో మ‌కాం వేసిన వీరంతా విజ‌యం త‌మ‌దేన‌ని ధీమాతో ఉన్నారు.

మ‌రో వైపు డిప్యూటీ స్పీక‌ర్ తిరుగుబాటు ప్ర‌క‌టించిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేస్తున్న‌ట్లు నోటీసులు జారీ చేశారు. ఇది చెల్లుబాటు కాదంటూ త‌మ‌కు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతూ ఏక్ నాథ్ షిండే సార‌థ్యంలోని ఎమ్మెల్యేలు గ‌వ‌ర్న‌ర్ కు లేఖ రాశారు.

మ‌రో వైపు వారి ఇళ్లు, ఆఫీసుల‌పై శివ‌సేన సైనికులు దాడుల‌కు పాల్ప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా రాడిస‌న్ హోట‌ల్ లో ఇవాళ రెబ‌ల్ ఎమ్మెల్యేల‌లో ఒకరైన భండారా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌రేంద్ర భోండేక‌ర్ పుట్టిన రోజు ఇవాళ‌.

దీంతో హోట‌ల్ లో గ్రాండ్ గా ఏక్ నాథ్ షిండే సార‌థ్యంలో ఎమ్మెల్యేలంతా గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా కేక్ ను తీసుకు వ‌చ్చి క‌ట్ చేయించారు. ఆయ‌న‌కు పుష్ప గుచ్ఛాల‌ను అంద‌జేశారు షిండేతో పాటు మిగ‌తా స‌హ‌చ‌ర ఎమ్మెల్యేలు.

ఈ సంద‌ర్భంగా త‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ చేసిన ప్ర‌తి ఒక్క‌రికి పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలిపారు ఎమ్మెల్యే న‌రేంద్ర భోండేక‌ర్(Narendra Bhondekar) .

ఇదిలా ఉండ‌గా శివ‌సేన పార్టీ స్పోక్స్ ప‌ర్స‌న్ సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇలా ఎంత కాలం గౌహతిలో ఉంటారంటూ ప్ర‌శ్నించారు. ఇక్క‌డికి వ‌స్తే మీ సంగ‌తి ఏంటో తేలుతుంద‌న్నారు.

Also Read : షిండే గ్రూప్ లో చేరిన మంత్రి సామంత్

Leave A Reply

Your Email Id will not be published!