Shiv Sena Rebels : నమ్ముకున్న వాళ్లే నట్టేట ముంచారు
ప్రమాదాన్ని పసిగట్ట లేక పోయిన ఠాక్రే
Shiv Sena Rebels : మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలి పోయింది. శివసేన పార్టీ చీఫ్, సీఎం ఉద్దవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. విచిత్రం ఏమిటంటే తను తప్పు కోవడానికి కారణమైంది మాత్రం కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు కాదు.
తన పార్టీకి చెందిన వారే తిరుగుబాటు ప్రకటించారు. తమను పట్టించు కోవడం లేదని, పక్కన పెట్టారని, నిధులు ఇవ్వడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు.
మొత్తం 55 మంది శివసేన ఎమ్మెల్యేలలో అత్యధిక ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పారు. తమదే అసలైన బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ
అంటూ ప్రకటించారు. క్యాంపు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చేశారు.
వారి వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉందంటూ శివసేన(Shiv Sena Rebels) జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ఉద్దవ్ ఠాక్రే కూడా స్పష్టం చేశారు.
మొత్తంగా ఈ వ్యవహారం 10 రోజులుగా సాగింది. జూన్ 20న జెండా ఎగుర వేశారు. గుజరాత్ లోని సూరత్ కు వెళ్లారు. అక్కడి నుంచి బీజేపీ
సారథ్యంలోని అస్సాంలోని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ లో బస చేశారు.
అక్కడి నుంచే చక్రం తిప్పారు. ఈ సందర్భంగా మొత్తం వ్యవహారంలో దేవేంద్ర ఫడ్నవీస్ కీలక పాత్ర పోషిస్తే ట్రబుల్ షూటర్ చక్రం తిప్పారు.
రాజీనామా చేసే కంటే ముందు ఉద్దవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం పదవితో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పదవి నుంచి తప్పుకుంటున్నందుకు బాధగా లేదన్నారు. అదే సమయంలో నంబర్ గేమ్ పై కూడా ఆసక్తి లేదని చెప్పారు.
పార్టీ ఎమ్మెల్యేలలో తనను ఏ ఒక్కరు వ్యతిరేకించినా అది తనకు అవమానమేనని చెప్పారు ఠాక్రే. కాగా శివసైనికులకు విన్నవించారు. ఏ ఒక్కరూ ఆందోళనలు, నిరసనలకు దిగవద్దంటూ విన్నవించారు.
ఈ సందర్భంగా మద్దతు తెలిపిన సోనియా గాంధీ, శరద్ పవార్ లకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : ఏక్ నాథ్ షిండేకు అరుదైన చాన్స్