Shiv Sena : భారతీయ జనతా పార్టీపై మరోసారి శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాను రాను శివసేన, బీజేపీల మధ్య మాటల యుద్దం పెరుగుతోంది.
నువ్వా నేనా అన్న రీతిలో నెలకొంది. హిందూత్వ సంస్కృతి ప్రధాన ఉద్దేశం జాతిని ఉద్దరించడం కానీ గందరగోళం సృష్టించేందుకు కాదని పేర్కొంది.
శివసేన పార్టీకి మౌత్ పీస్ గా పేరొందిన పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో నిప్పులు చెరిగింది. హనుమాన్ చాలీసా వివాదంపై(Shiv Sena) స్పందించింది.
ఓ వైపు ప్రజలు సమస్యలతో ఎదుర్కొంటుంటే మతం పేరుతో ఇబ్బందులు గురి చేయడం మంచిది కాదని పేర్కొంది. ఈ విషయంపై సామ్నా సంపాదకీయంలో వెల్లడించింది.
మహారాష్ట్ర సెం ఉద్దవ్ థాకరే, ఎంపీ , ఎమ్మెల్యే రాణా దంపతుల మధ్య ప్రతిష్టంభన పై బీజేపీ దాడి చేసింది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ హిందుత్వం పేరుతో ప్రారంభించిన కుంభకోణాన్ని సమర్థించ లేమని తెలిపింది.
హిందూత్వం అంటే సంస్కృతి కాదు గందరగోళం కాదు. రాణా దంపతులు అమరావతికి చెందిన ఎంపీ నవనీత్ కౌర్ , ఎమ్మెల్యే రవి రాణా ఏ పార్టీ జెండా ఎగుర వేస్తారో చెప్పలేమని స్పష్టం చేసింది.
మాతృశ్రీ వెలుపల హిందూ శ్లోకం హనుమాన్ చాలీసాను పాడుతామంటూ ప్రజలను రెచ్చ గొట్టారు. దీంతో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు చెప్పారు.