Supreme Court : శివలింగం సురక్షితం నమాజ్ ఆపొద్దు
జ్ఞాన్ వాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు
Supreme Court : యూపీ మరోసారి వార్తల్లో నిలిచింది. వారణాసి లోని జ్ఞాన్ వాపి మసీదుకు సంబంధించి సర్వే చేపట్టాలని వారణాసి సిటీ కోర్టు ఆదేశించడం, దానిని ముస్లిం వర్గాలు అభ్యంతరం తెలపడంతో ఇది మరింత ఉత్కంఠను రేపింది.
ఈ తరుణంలో సర్వే పూర్తయింది. కట్టు దిట్టమైన భద్రత మధ్య పూర్తి చేశారు. నివేదిక తయారు కాక పోవడంతో మరో రెండు రోజులు గడువు ఇచ్చింది కోర్టు. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు(Supreme Court) చేరింది పంచాయతీ. దీనిపై మంగళవారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా మసీదు ప్రాంతంలో శివలింగం ఉందన్న అంశం చర్చకు దారి తీసింది. శివలింగం ప్రాంతం సురక్షితంగా ఉందని కానీ దీని పేరుతో నమాజును ఆపవద్దంటూ సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం స్పష్టం చేసింది.
మసీదు సముదాయం సర్వేను నిలిపి వేయాలంటూ వారణాసి లోని అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మసీదు కమిటీ వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఇదిలా ఉండగా జ్ఞాన్ వాపి మసీదు కేసును కోర్టు ఈనెల 19న గురువారం విచారించనుంది. ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ లోని జ్ఞాన్ వాపి మసీదులో శివ లింగం సరిగ్గా ఎక్కడ కనిపించిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జస్టిస్ డీవై చంద్రచూడ్ .
తాము నివేదికను చూడలేదంటూ యూపీ సర్కార్ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుదులిచ్చారు. వివరాలతో తిరిగి రావడానికి సమయం ఇవ్వాలని కోరారు.
ముస్లింలు నవాజ్ కోసం మసీదుకు రాకుండా అడ్డుకోవద్దని, శివలింగం ప్రాంతాన్ని రక్షించాలని వారణాజి జిల్లా మేజిస్ట్రేట్ ను ఆదేశించింది సుప్రీంకోర్టు.
Also Read : అల్లర్లు జరగకుండా చూడండి – దీదీ