Shivpal Yadav Yogi : ఉత్తర ప్రదేశ్ (UP) రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికలు ముగిసినా ఇంకా ఆ వేడి తగ్గలేదు. 403 సీట్లకు గాను భారతీయ జనతా పార్టీ (BJP) 273 సీట్లు గెలుపొందింది.
సమాజ్ వాది పార్టీ కూటమి 125 సీట్లు దక్కించుకుంది. ఎన్నికల సందర్భంగా రెండు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు, బీఎస్పీకి ఒకే ఒక్క సీటుతో సరి పెట్టుకున్నాయి.
అఖిలేష్ యాదవ్ బాబాయ్ అయిన శివపాల్ యాదవ్ తో కలిసే ఎన్నికల్లో ప్రచారం చేశారు. తన బాబాయి ములాయం సింగ్ యాదవ్ తో కూడా కలవడం అప్పట్లో చర్చకు దారి తీసింది.
వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని అందుకే శివలాల్ యాదవ్(Shivpal Yadav Yogi) సీఎం యోగిని (Yogi) కలుసుకున్నారని ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ నియోజకవర్గంకు సంబంధించి శివలాల్ యాదవ్ (Shivpal Yadav) వర్గీయులపై వేటు వేశారు అఖిలేష్ యాదవ్.
దీనిపై గుర్రుగా ఉన్న శివపాల్ యాదవ్ (Shivpal Yadav) సిఎం యోగిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలకు ముందు ఎస్పీతో పొత్తు పెట్టుకున్నా రిజల్ట్ ఆశించిన రీతిలో రాలేదు.
దీంతో యోగితో (Yogi) కలిశాక ఏం మాట్లాడుకున్నారనే దానిపై తెలియదు. అయితే వీరిద్దరూ 30 నిమిషాలకు పైగా చర్చలు సాగాయి. ఒక రకంగా అఖిలేష్ యాదవ్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారా అనేది ప్రచారం జరుగుతోంది.
ఏది ఏమైనా ఎన్నికల్లో ఏ పార్టీపై ఆధారపడకుండా బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చింది. 2017కు ముందు శివపాల్ యాదవ్ స్వంత పార్టీని ఏర్పాటు చేశారు.
ఐదుగురు సభ్యులు ఉన్నారు ఆయన వైపు. ఈ తరుణంలో శివపాల్ యాదవ్ అఖిలేష్ వైపు మొగ్గు చూపడం ఉత్కంఠకు తెర లేచింది.
Also Read : శాంతి మంత్రం హింసకు దూరం