Shivraj Patil : శివరాజ్ పాటిల్ కామెంట్స్ కలకలం
జిహాద్ ఖురాన్ లోనే కాదు గీతలో ఉంది
Shivraj Patil : కేంద్ర హొం శాఖ మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి. ఆయన ఏమన్నారంటే జిహాద్ ఒక్క ఖురాన్ లోనే కాదు హిందువులు పరమ పవిత్ర గ్రంథంగా కొలిచే, భావించే భగవద్గీతలో కూడా ఉందన్నారు. దీనిపై భారతీయ జనతా పార్టీ నిప్పులు చెరిగింది.
భారతదేశ సమగ్రతకు భంగం కలిగించేలా శివరాజ్ పాటిల్(Shivraj Patil) మాట్లాడారంటూ వెంటనే జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా శ్రీకృష్ణుడు గీతలో జిహాద్ గురించి బోధించాడంటూ కొత్త భాష్యం చెప్పాడు పాటిల్. ప్రస్తుతం దేశంలో సవాలక్ష సమస్యలు పరిష్కారానికి నోచు కోవడం లేదు.
ఓ వైపు బీజేపీ హిందూ కార్డుతో ముందుకు వెళుతోంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఇంకా యాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు. కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి తీసుకు వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాల్సిన పాటిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీకి తలనొప్పిగా మారింది.
స్వంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిహాద్ పేరుతో మారణ హోమం సృష్టిస్తున్నారని, ఆ పదం గీతలో కూడా ఉందన్నారు. శివరాజ్ పాటిల్ మంచి ఉద్దేశంతో చెప్పినప్పటికీ అది ఇప్పుడు వ్యతిరేకంగా మారింది. కాగా పాటిల్ కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ జీవిత చరిత్ర పుష్కక ఆవిష్కరణ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : ఇమ్రాన్ ఖాన్ కు ఎన్నికల సంఘం షాక్