Shiv Raj Singh Chouhan : భారత దేశ రాజకీయాలలో ఆయనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఆయనే శివరాజ్ సింగ్ చౌహాన్. ఇవాళ ఆయన సుదీర్ఘ కాలం పాటు సీఎంగా పని చేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.
చౌహాన్ ను అంతా ప్రేమగా మామాజీ అని పిలుస్తారు. 1959 మార్చి 5న పుట్టారు. పేరెంట్స్ ప్రేమ్ సింగ్ చౌహాన్(Shiv Raj Singh Chouhan ), సుందర్ బాయ్ చౌహనా్. భోపాల్ లోని బర్కతుల్లా యూనివర్శిటీ నుంచి పీజీ చేశారు.
ఇందులో గోల్డ్ మెడల్ సాధించారు. విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నారు. 1976-77 కాలంలో చోటు చేసుకున్న ఎమర్జెన్సీని వ్యతిరేకించాడు. జైలు శిక్ష అనుభవించాడు చౌహాన్.
1977 నుంచి రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ – ఆర్ఎస్ఎస్ లో వలంటీర్ గా పని చేశాడు. 1992లో సాధానా సింగ్ తో పెళ్లి జరిగింది. ఆయనకు ఇద్దరు పిల్లలు. 1977-78లో ఏబీవీపీలో పదాధికారిగా ఎన్నికయ్యాడు.
1975 నుంచి 1980 దాకా మధ్య ప్రదేశ్ లో ఏబీవీపీ కి సంయుక్త కార్యదర్శిగా పని చేశాడు. 1982-83లో కౌన్సిల్ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడిగా ఉన్నారు. 1984-85లో భారతీయ జనతా యువ మోర్చా కార్యదర్శిగా ఉన్నారు.
1985 నుంచి 1991 వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు చౌహాన్(Shiv Raj Singh Chouhan ). 2005లో భారతీయ జనతా పార్టీ చీఫ్ గా నియమితులయ్యారు. శివరాజ్ సింగ్ చౌహాన్ 2005 నవంబర్ 29న మధ్య ప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
2018లో బీజేపీకి మెజారిటీ రాక పోవడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. 2020 మార్చి 23న తిరిగి సీఎంగా కొలువు తీరారు. భారతీయ జనతా పార్టీ తరపున అత్యధిక కాలం పాటు సీఎంగా చరిత్ర సృష్టించారు.
Also Read : ‘అభిషేక్..రుజిరా’ బెనర్జీలకు సమన్లు