Shivraj Singh Chouhan : యూపీలో మూడో విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. ఇక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరోసారి పవర్ లోకి రావాలని కోరుకుంటోంది.
ఇందులో భాగంగా భారీ ఎత్తున ప్రచారం చేసింది. 2017లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించింది. కానీ ఈసారి విక్టరీ అంత సులభవం కాదని బీజేపీ హైకమాండ్ గ్రహించింది.
రాష్ట్రంలో బీజేపీతో పాటు సమాజ్ వాది పార్టీ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఎస్పీ, ఇతర పార్టీలు కూడా బరిలో ఉన్నాయి. సీఎం యోగి ఆదిత్యానాథ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా యూపీ పైనే ఫోకస్ పెట్టారు.
రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలకు ఈ ఎన్నికల్ని రెఫరెండమ్ గా భావిస్తోంది బీజేపీ. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ సమాజ్ వాది పార్టీ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో సాగుతోంది.
మొత్తం ఏడు విడతలుగా పోలింగ్ కొనసాగనుంది. ఈ తరుణంలో మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan)సంచలన వ్యాఖ్యలు చేశారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పై.
తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ నమ్మడం లేదని, ఇక రాష్ట్రంలోని ప్రజలు ఎలా నమ్ముతారంటూ ప్రశ్నించారు. గతంలో పాలకులు రాష్ట్రాన్ని నేరమయంగా, మాఫియాలకు అడ్డంగా మార్చేశారని, తమ ఆస్తులను పెంచుకున్నారంటూ ఆరోపించారు.
కానీ తమ పార్టీ పవర్ లోకి వచ్చాక నేరస్తుల ఆట కట్టించారంటూ కితాబు ఇచ్చారు.
Also Read : ఉద్దవ్ తో కేసీఆర్ భేటీపై ఉత్కంఠ