Amanatullah Khan : ఆప్ నేత అమానతుల్లా ఖాన్ కు షాక్
బిగుస్తున్న సీబీఐ కేసు ఉచ్చు
Amanatullah Khan : కేంద్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ప్రధానంగా తమ ఆధీనంలో లేకుండా పోయిన దేశ రాజధాని ఢిల్లీని ఎలాగైనా చేజిక్కించు కోవాలని చేయని ప్రయత్నం అంటూ లేదు.
ఈ తరుణంలో ఇప్పటికే ఇక్కడ కొలువుతీరిన ఆమ్ ఆద్మీ పార్టీకి చుక్కలు చూపిస్తోంది. ఆప్ ఆరోగ్య మంత్రిని అరెస్ట్ చేసింది. మరో ఆప్ నాయకుడిపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది సీబీఐ.
అక్రమ నియామకాల కేసులో ఆప్ కి చెందిన అమానతుల్లా ఖాన్ పై ఫోకస్ ఎట్టింది. ఈ మేరకు ఆయనకు సంబంధించిన కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిందని ఇక మిగిలింది అతడికి శిక్ష పడేలా చేయడమేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఏడాది మేలో ఈ కేసు కదిలించింది. పూర్తి విచారణ చేపట్టింది. కేసుకు సంబంధించి ఎవరెవరికి నియామకాలు అందాయనే దానిపై ఆరా తీసింది సీబీఐ.
2016లో తనపై నమోదైన అక్రమ నియామకాల కేసులో ఆప్ ఎమ్మెల్యే, ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అమానుతుల్లా ఖాన్(Amanatullah Khan) ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు విన్నవించింది.
ఈ మేరకు ఎల్జీ అనుమతిత మంజూరు చేసినట్లు సమాచారం. నియమాలు పక్కన పెట్టారు. అడ్డగోలుగా నిబంధనలు అతిక్రమించారు. ఉద్దేశ పూర్వకంగా, నేర పూరితంగానే వ్యవహరించారంటూ సీబీఐ తన నివేదికలో పేర్కొంది.
బోర్డు చైర్మన్ అమానతుల్లా ఖాన్ తో పాటు సిఇఓ మెహబూబ్ ఆలంపై కూడా విచారణకు అనుమతి కోరింది సిబీఐ.
Also Read : లంక సంక్షోభం భారత్ జోక్యం అవసరం