Shooting Michigan University : మిచిగాన్ క్యాంపస్ లో కాల్పులు
ఒకరు మృతి పరిస్థితి ఉద్రిక్తం
Shooting Michigan University : అమెరికాలో కాల్పుల మోత కొనసాగుతునే ఉంది. బైడెన్ సర్కార్ కొలువు తీరాక కంట్రోల్ తప్పింది. తాజాగా మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ క్యాంపస్ లోపల కాల్పులు(Shooting Michigan University) చోటు చేసుకున్నాయి. ఒకరు చని పోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని యుఎస్ కు చెందిన డెట్రాయిట్ వెల్లడించింది. కాల్పులు జరిగిన రెండు గంటల తర్వాత అనేక క్యాంపస్ భవనాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇదిలా ఉండగా ఈ ఘటన మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో సోమవారం రాత్రి కాల్పులు జరిగాయి. ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈస్ట్ లాన్సింగగ్ లోని ప్రధాన క్యాంపస్ లో కాల్పులకు(Shooting Michigan University) పాల్పడిన నిందితుడి కోసం వెతుతుకున్నారు పోలీసులు.
తుపాకీ హింస గురించి తీవ్ర ఆందోళన నెలకొంది. యూనివర్శిటీ పోలీసులు ట్విట్టర్ లో రెండు ప్రదేశాలలో కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. బర్కీ హాల్ విద్యా భవనంలో , ఐఎం ఈస్ట్ అని పిలిచే అథ్లెటిక్ సమీపంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. కాగా మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ (ఎంఎస్ యు) ప్రతినిధి ఎమిలీ గురాంట్ ను ఉటంకిస్తూ బర్కీ హాల్ లోపల క్యాంపస్ లో ఒకరు మరణించినట్లు డెట్రాయిట్ నివేదించింది. కాగా రాయిటర్స్ ఈ సమాచారాన్ని ఇంకా ధ్రువీకరించలేదు.
బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. లాన్సింగ్ రాజధానికి సమీపంలో ఉన్న కాలేజీ పట్టణం, డెట్రాయిట్ కు 90 మైళ్ల దూరంలో ఒక అనుమానితుడు ముసుగు ధరించి వెళుతున్నట్లు కనుగొన్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉందని పేర్కొంటున్నా పరిస్థితి అంతలా లేదు.
Also Read : జి20 సమ్మిట్ క్రెడిట్ మోదీదే