IPL 2022 Auction : ఐపీఎల్ వేలం పాటలో వేలం పాట దారుడు అకస్మాత్తుగా కుప్ప కూలడంతో వాయిదా పడింది. ఇక ఇప్పటి వరకు పలువురు ఆటగాళ్లకు వేలం పాట పూర్తయింది. వీటిలో అత్యధిక ధరకు అమ్ముడు పోయాడు శ్రేయాస్ అయ్యార్.
అతడిని కోల్ కతా నైట్ రైడర్స్ చేజిక్కించుకుంది. స్టార్ బౌలర్ హర్షల్ పటేల్ ను ఆర్సీబీ రూ. 10 . 75 కోట్లకు(IPL 2022 Auction) తీసుకుంది. గత సీజన్ లో కూడా ఆ జట్టు తరపున 32 వికెట్లు తీసి సత్తా చాటాడు.
దీపక్ హూడాను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 5.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతడి కోసం ఆర్సీబీ, సీఎస్కే, సన్ రైజర్స్ హైదరాబాద్ , ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి చివరకు లక్నో స్వతంం చేసుకుంది.
వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ పంట పండింది. జాసన్ హోల్డర్ వేలం లోకి వచ్చాడు. కనీస ధర రూ. 1.50 కోట్లు కాగా రూ. 8.75 కోట్లకు లక్నో యాజమాన్యం తీసుకుంది. పడిక్కల్ కనీస ధర రూ. 2 కోట్లు కాగా రాజస్తాన్ రాయల్స్ భారీ ధరకు దక్కించుకుంది.
అతడికి రూ. 7.75 కోట్లు పెట్టింది. గత సీజన్ లో ఆర్సీబీ కి రూ. 20 లక్షలకు అమ్ముడు పోయిన పడిక్కల్ ఈసారి సత్తా చాటాడు. మెగా వేలంలో సురేష్ రైనా, స్టీవ్ స్మిత్ ను ఎవరూ పట్టించు కోలేదు.
ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ ను రూ. 2 కోట్లకు చేజిక్కించుకుంది గుజరాత్. రాబిన్ ఊతప్పను రూ. 2 కోట్లకు తిరిగి తీసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. హిట్మైర్ ను భారీ ధరకు తీసుకుంది రాజస్థాన్ రాయల్స్(IPL 2022 Auction). ప్రస్తుతానికి 10 మందికి పైగా ప్లేయర్ల వేలం పూర్తయింది.
అత్యధికంగా శ్రేయస్ అయ్యర్ పాడారు. రూ. 12.25 కోట్లు, రబాడాకు రూ. 9.25 కోట్లు, హర్షల్ పటేల్ కు రూ. 10.75 కోట్లు, శిఖర్ ధావన్ కు రూ. 8. 25 కోట్లు, బౌల్ట్ కు రూ. 8 కోట్లకు అమ్ముడు పోయారు.
ఇక పాట్ కిమ్సిన్ రూ. 7.25 కోట్లకు కేకేఆర్ తీసుకుంది. డుప్లెసిస్ రూ. 7 కోట్లు, డికాక్ రూ. 6.75 కోట్లు, డేవిడ్ వార్నర్ రూ. 6.25 కోట్లు షమీ రూ. 6.25 కోట్లు, అశ్విన్ రూ. 5 కోట్లకు అమ్ముడు పోయారు.
Also Read : శ్రేయస్ కోల్ కతా పరం వార్నర్ ఢిల్లీ వశం