Siddaramaiah : సిద్దరామయ్యనే సీఎం..డీకే నెక్స్ట్
ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం
Siddaramaiah : కర్ణాటక ఉత్కంఠకు తెర దించేందుకు ఏఐసీసీ నడుం బిగించింది. ఈ మేరకు నువ్వా నేనా అన్న రీతిలో ఇప్పటి దాకా పోటీ నెలకొంది. చివరకు మాజీ సీఎం , క్లీన్ ఇమేజ్ కలిగిన సిద్దరామయ్యకు హైకమాండ్ ఛాన్స్ ఇచ్చింది. ఈ విషయం విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఇదిలా ఉండగా చివరి దాకా సీఎం రేసులో ఉన్న కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ కు 2 ఏళ్ల తర్వాత సీఎంగా కొలువు తీరేలా ఇద్దరి మధ్య ఒప్పందం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
చివరి దాకా చోటు చేసుకున్న ప్రతిష్టంభనకు పుల్ స్టాప్ పెట్టింది. ఈ మేరకు గురువారం కొత్త సీఎం ఎవరు అనే దానిపై ఏఐసీసీ క్లారిటీ ఇవ్వనుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేయనుంది. ఇదిలా ఉండగా సిద్దరామయ్యకు పదవి దక్కనుండడంతో ఆయన వర్గీయులు సంబురాల్లో మునిగి పోయారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 224 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 136 సీట్లు సాధించి ఏకైక పార్టీగా అవతరించింది.
కానీ సీఎం ఎంపిక వ్యవహారం కొలిక్కి రాలేదు. చివరకు ఎంపిక వ్యవహారం యధావిధిగా హస్తినకు చేరుకుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ లు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మల్ల గుల్లాలు పడ్డారు. సిద్దరామయ్య వైపు పార్టీ మొగ్గు చూపింది.
Also Read : Appalayagunta