Siddaramaiah : కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై పై సంచలన ఆరోపణలు చేశారు మాజీ సీఎం సిద్దరామయ్య(Siddaramaiah). బొమ్మై ఎన్నికైన సీఎం కాదని డబ్బులు ఇచ్చి కొలువు తీరిన సీఎం అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
డబ్బులు ఇచ్చి పోస్టును కొనుగోలు చేసిన చరిత్ర ఆయనకే ఉందన్నారు. ఇదిలా ఉండగా తాజాగా సిద్దరామయ్య చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ఈ కామెంట్స్ సిద్దరామయ్య బెళగావిలో జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చకు దారితీశాయి. కన్నడ నాట త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
భారతీయ జనత పార్టీలో పదవుల ఎంపిక కార్యక్రమం పైరవీలకు, కాసులు ఇచ్చే వారికి కేరాఫ్ గా మారిందంటూ మండిపడ్డారు. బొమ్మై సీఎం నియామకం వెనుక భారీగా డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు.
డబ్బులు ఇచ్చి సీఎం పదవిలో కొలువు తీరిన బొమ్మై ప్రజా సమస్యలను గాలికి వదిలి వేశారని, మత కలహాలకు కేరాఫ్ గా మారినా , ఎస్ఐ పరీక్ష కుంభకోణం చోటు చేసుకున్నా ఈరోజు దాకా చర్యలు తీసుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు సిద్దరామయ్య.
బాధ్యత కలిగిన సీఎంగా పని చేయడం లేదని ఫైర్ అయ్యారు. బొమ్మైని పదవిలో కూర్చోబెట్టింది బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అని. ఆ సంస్థ ఏది చెబితే బొమ్మై అదే చేస్తారంటూ ఎద్దేవా చేశారు సిద్దరామయ్య(Siddaramaiah).
ఈ నాలుగు సంవత్సరాలలో పేదలకు ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదంటూ సీరియస్ అయ్యారు బొమ్మైపై.
Also Read : ఖలేజా ఉంటే నాపై పోటీకి దిగు