Sidhu : లొంగిపోయేందుకు సిద్దూ నిర్ణయం
పీసీసీ మాజీ చీఫ్ నివాసం వద్ద ఉద్రిక్తం
Sidhu : 1988 నాటి రోడ్డు కేసులో సుప్రీంకోర్టు పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సిద్దూ కు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో సిద్దూ శుక్రవారం పాటియాలా లోని కోర్టులో లొంగి పోయే అవకాశం ఉంది.
శిక్షకు గురైన సిద్దూ నివాసం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో నిండి పోయింది. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన నివాసానికి చేరుకున్న వారిలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుర్జీత్ సింగ్ ధీమాన్ కూడా ఉన్నారు.
పాటియాలా జిల్లా కాంగ్రెస్ కమిటీ చీఫ్ నరీందర్ పాల్ లాలీ రాత్రి పార్టీ మద్దతుదారులకు పంపిన సందేశంలో నవ జ్యోత్ సింగ్ సిద్దూ(Sidhu) కోర్టుకు చేరుకుంటారని తెలిపారు. మీరంతా అక్కడికి రావలని పిలుపునిచ్చారు.
క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సిద్దూ భార్య నవజోత్ కౌర్ సిద్దూ కూడా పాటియాలకు చేరుకున్నారు. 1988 నాటి కేసులో శిక్ష విధించడం చర్చకు దారి తీసింది.
తగిన శిక్ష విధించేందుకు ఏదైనా అనవసరమైన సానుభూతి న్యాయ వ్యవస్థకు మరింత మాని కలిగిస్తుందని , సమర్థతపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీస్తుందని పేర్కొంది కోర్టు.
రోడ్డు ప్రమాదంలో చోటు చేసుకున్న ఘటనలో 65 ఏళ్ల వృద్దుడు మరణించిన కేసులో సిద్దూ(Sidhu) కు సుప్రీంకోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది.
58 ఏళ్ల వయసు కలిగిన సిద్దూ ట్విట్టర్ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అందరూ సమానులే. శిక్షను స్వీకరిస్తాను. లొంగి పోయేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు.
Also Read : లాలూ ఫ్యామిలీకి సీబీఐ బిగ్ షాక్