Sidhu Resign : పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం దృష్ట్యా మాజీ క్రికెటర్, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ (Sidhu Resign)ఇవాళ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి పంపించారు.
ఈ లేఖను తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మాజీ సీఎం చన్నీ, సిద్దూ నిర్వాకం వల్లనే పార్టీ ఓడి పోయిందంటూ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ తరుణంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో సోనియా గాంధీ ఐదు రాష్ట్రాలలో పార్టీ ఓటమి పాలవడంపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ చీఫ్ లు వెంటనే తమ పదవుల నుంచి తప్పుకోవాలని ఆదేశించారు.
ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాల్ ధ్రువీకరించారు.
మేడం సోనియా గాంధీ ఆదేశాల మేరకు తాను పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు సిద్దూ(Sidhu Resign).
పార్టీని పునర్ వ్యవస్థీకరించడంలో భాగంగానే ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్ లను రాజీనామా చేయాలని కోరినట్లు రణ్ దీప్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా పంజాబ్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయాన్ని స్వాగతించారు.
ప్రజలు తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారంటూ వ్యాఖ్యానించారు. ఒక రకంగా ఆప్ ను ప్రశంసించారు. దీనిపై పార్టీలో కలకలం రేపాయి సిద్దూ కామెంట్స్ .
ఎందుకులు ఇలా పేర్కొన్నారంటూ ప్రశ్నించిన మీడియాకు ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చారు. ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పారు.
Also Read : అందరి చూపు ‘ఖట్కర్ కలాన్’ వైపు