Sidhu : సిద్దూ కామెంట్స్ క‌ల‌క‌లం

చింత కాదు కావాల్సింది చింత‌న్

Sidhu : ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టిన దెబ్బ‌కు ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఇంటి బాట ప‌ట్టాయి పంజాబ్ లో. ఎన్నిక‌లు ముగిశాయి. ఆప్ త‌న‌దైన శైలిలో దూసుకు పోతోంది. ఇత‌ర రాష్ట్రాల‌లో కూడా విస్త‌రించాల‌ని ప్లాన్ చేస్తోంది.

ఈ త‌రుణంలో ప‌వ‌ర్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న‌ట్టుండి అధికారాన్ని కోల్పోవ‌డం బిగ్ షాక్ కు గురి చేసింది. ఆ పార్టీకి చెందిన జాతీయ అధికార ప్ర‌తినిధి ర‌ణ దీప్ సూర్జే వాలా మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ పై మండిప‌డ్డారు.

ఆయ‌న నిర్వాకం వ‌ల్ల‌నే త‌మ పార్టీ గ‌ణ‌నీయంగా సీట్ల‌ను కోల్పోయింద‌ని ఆరోపించారు. దీనిపై కెప్టెన్ త‌ప్పు ప‌ట్టారు. ఈ త‌రుణంలో పంజాబ్ రాష్ట్ర ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ గా ఉన్న న‌వ జ్యోత్ సింగ్ సిద్దూ చేసిన(Sidhu) కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

ఏ విత్త‌నం నాటితే ఆ మొక్కే వ‌స్తుంద‌న్నారు. అంతే కాదు ప్ర‌జ‌లు స‌రైన తీర్పు ఇచ్చార‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీని అభినందిస్తున్న‌ట్లు చెప్పారు.

మాజీ సీఎం అమరీంద‌ర్ సింగ్ , సిద్దూ ల మ‌ధ్య నెల‌కొన్న ఆధిప‌త్య పోరు చివ‌ర‌కు కాంగ్రెస్ పార్టీని కొంప ముంచేలా చేసింది. దీనిపై మాట్లాడుతూ సిద్దూ తాను ఎక్క‌డికీ వెళ్ల‌న‌ని పంజాబ్ లోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

త‌న ర‌క్తం ఇక్క‌డే ఉంద‌న్నారు. గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం చ‌న్నీ, సిద్దూ ఓడి పోయారు.

ఇక శిరోమ‌ణి అకాలీద‌ళ్ కు చెందిన బాద‌ల్ , బిక్ర‌మ్ సింగ్ మ‌జిథియా ప‌రాజ‌యం పాల‌య్యారు. మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ పాటియాలాలో ఓట‌మి పాల‌య్యారు. మొత్తంగా సిద్దూ చేసిన కామెంట్స్ పై పార్టీలో క‌ల‌క‌లం రేగుతోంది.

Also Read : ట్ర‌బుల్ షూట‌ర్ కీల‌క కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!