Sidhu Moosewala Parents : న్యాయం జరగక పోతే నిరసన
సిద్దూ మూసేవాలా తల్లి ప్రకటన
Sidhu Moosewala Parents : తమకు న్యాయం జరగక పోతే నిరసనకు దిగుతామని సంచలన ప్రకటన చేశారు ఇటీవల పంజాబ్ కు చెందిన ప్రముఖ సింగర్ సిద్దూ మూసేవాలా దారుణ హత్యకు గురయ్యారు.
ఇప్పటి వరకు దోషులను పట్టుకున్న పాపాన పోలేదని ఆరోపించారు సింగర్ సిద్దూ పేరెంట్స్(Sidhu Moosewala Parents). ఇదిలా ఉండగా సిద్దూ హత్య కేసులో ఆరుగురు షూటర్లు పాల్గొన్నారని తేల్చారు పోలీసులు.
ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు పోలీసు ఎన్ కౌంటర్ లో మరణించగా ఒకరు కనిపించకుండా పోయారు. ఇదిలా ఉండగా తమకు ఇంకా న్యాయం జరగలేదని సిద్దూ మూసేవాలా తల్లి ఆరోపించారు.
మూడు నెలలు గడిచినా అసలు నిందితులు కటకటాల వెనక్కి రాలేదని వాపోయారు. తమ కుమారుడికి న్యాయం చేయకుంటే తాను , తన భర్తతో కలిసి ఆందోళన ప్రారంభిస్తామని హెచ్చరించారు.
తన భర్త బల్కౌర్ సింగ్ తో కలిసి పంజాబ్ లోని మాన్సా లోని సిద్దూ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ఈ సందర్భంగా సిద్దూ తల్లి చరణ్ కౌర్ కొడుక్కి ఫ్యాన్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు.
తమ కొడుకు చని పోయి నెలలు గడిచినా ఇప్పటి వరకు కేసులో దోషులను పట్టుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. ఇప్పటి వరకు నిజమైన నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ నిప్పులు చెరిగారు.
ఇదిలా ఉండగా మే 29న పంజాబ్ లోని మాన్సా జిల్లాలో సిద్దూ మూసేవాలాగా ప్రసిద్ది చెందిన శుభ దీప్ సింగ్ సిద్దూ కాల్చి చంపబడ్డాడు.
Also Read : స్టీరింగ్ కమిటీకి ఆనంద్ శర్మ రాజీనామా