Sidhu Moosewala : పంజాబ్ సింగర్ సిద్దూ కాల్చివేత
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
Sidhu Moosewala : ప్రముఖ పంజాబీ సింగర్ సిద్దూ మూస్ వాలా పై దుండగులు కాల్పులు జరిపారు. 30 రౌండ్లకు పైగా కాల్పులు జరిపినట్లు సమాచారం. అక్కడికక్కడే సిద్దూ వాలా కుప్ప కూలి పోయాడని , మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలైనట్లు తెలిసింది.
ఈ ఘటన ఆదివారం పంజాబ్ లోని మాన్సా జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దూ మూసే వాలా(Sidhu Moosewala) పై విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. పంజాబీలోనే కాదు దేశ వ్యాప్తంగా పేరొందిన పంజాబీ గాయకుల్లో సిద్దూ మూసే వాలా ఒకరు.
ఇటీవలే పంజాబ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాజీ పీసీసీ చీఫ్ నవ జ్యోత్ సింగ్ సిద్దూ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో సీఎంగా కొలువు తీరాక భగవంత్ మాన్ 424 మంది ప్రముఖులకు సెక్యూరిటీ తొలగించారు.
దీంతో భద్రత తొలగించిన మరుసటి రోజే సిద్దూ మూసే వాలాపై కాల్పులకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. దీంతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సిద్దూపై కాల్పుల ఘటనకు సంబంధించి సీఎం మాన్ ఆరా తీశారు.
కాగా సిద్దూ మూస్ వాలా కాంగ్రెస్ పార్టీ టికెట్ పై మాన్సా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన డాక్టర్ విజయ్ సింగ్లా చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రాథమిక సమాచారం మేరకు 30 రౌండ్లకు పైగా కాల్పులకు పాల్పడినట్లు తెలిసింది.
ఈ ఘటన మాన్సా జిల్లాలోని జవహార్కే వద్ద జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మూసే వాలాను సివిల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు వైద్యులు.
Also Read : సుప్రియాకు మరాఠా బీజేపీ చీఫ్ క్షమాపణ