Sidhu Murder Case : సిద్దూ హత్య కేసులో 8 మంది గుర్తింపు
నిందితుల పేర్లు పోలీసుల విడుదల
Sidhu Murder Case : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ ఫేమస్ సింగర్ సిద్దూ మూసే(Sidhu Murder Case) వాలా హత్య కేసులో కీలక ఆధారాలు లభించాయి. ఈ మేరకు పోలీసులు సోమవారం ఎవరు పాల్గొన్నారనే దానిపై ఎనిమిది మంది అనుమానితుల వివరాలు వెల్లడించారు.
వీరంతా షూటర్స్ అంటూ తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో పంజాబ్ , హర్యానా, రాజస్థాన్ , మహారాష్ట్రకు చెందిన వారున్నారు. మూడు రాష్ట్రాలలోను పోలీసు బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి.
28 ఏళ్ల సిద్దూను దుండగులు కాల్చి చంపారు. ఇప్పటి వరకు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇంకా ఐదుగురిని అదుపులోకి తీసుకోవాల్సి వుంది. ఇక పోలీసులు వెల్లడించిన నిందితుల జాబితా ఇలా ఉంది.
పంజాబ్ లోని మెగాకు చెందిన మన్ ప్రీత్ సింగ్ మన్ను ఉన్నాడు. పంజాబ్ లోని ఒక జైలులో ఉన్న అతడిని మాన్సాకు తీసుకు వచ్చారు. రెండో నిందితుడు అమృత్ సర్ కు చెందిన జగ్రూప సింగ్ రూపా కాగా మూడో నిందితుడు ఇదే ప్రాంతానికి చెందిన మన్నిగా గుర్తించారు.
నాల్గో నిందితుడు హర్యానా లోని సోనిపట్ కు చెందిన ప్రియవ్రత్ ఫౌజీ. రామ్ కరణ్ గ్యాంగ్ కు చెందిన వ్యక్తి. షార్ప్ షూటర్ గా పనిచేశాడు.
హర్యానా పోలీసులు ఇప్పటికే ఇతడిని పట్టిస్తే రూ. 25 వేలు ఇస్తామని ప్రకటించారు. ఇక ఐదో నిందితుడు సోనిపట్ కు చెందిన అంకిత్ సెర్సా జాతి. ఆరో నిందితుడు పుణెకు చెందిన సంతోష్ జాదవ్ హత్య కేసులో పరారీలో ఉన్నాడు.
ఇదే పూణెకు చెందిన ఏడో నిందితుడు సౌరవ్ మహాకల్ గా గుర్తించారు. ఇక 8వ నిందితుడు రాజస్తాన్ లోని సికార్ కు చెందిన సుభాష్ భానుడ గా గుర్తించారు పోలీసులు.
Also Read : గ్యాంగ్ రేప్ కేసులో ఇన్నోవా లభ్యం