Simhadri Appanna : సింహాద్రి అప్పన్నకు పుష్పార్చన
108 బంగారు సంపెంగలతో అలంకరణ
Simhadri Appanna : శ్రీశ్రీశ్రీ సింహాచలం వరహ ల్మీ నరసింహ్మ వారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిపించారు. గురువారం అప్పన్న స్వామికి స్వర్ణ పుష్పార్చన అంగరంగ వైభవంగా చేపట్టారు.
Simhadri Appanna Temple Rush with Devotees
భక్తులు భారీ ఎత్తున హాజరయ్యారు. స్వర్ణ పుష్పార్చన చేయించుకున్నారు. సింహాచల పుణ్య క్షేత్రంలో దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల , నాద స్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పారచ్చన వైభవంగా నిర్వహించారు.
అర్చకులు వేకువ జామున సింహాద్రి అప్పన్న(Simhadri Appanna) స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు. ప్రాతః కాల పూజలు సంప్రదాయ బద్దంగా జరిపించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధీష్టింప చేశారు. వేద మంత్రాలు, నాద స్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి వారికి స్వర్ణ పుష్పార్చన , సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారి భ్రమరాంబ, పర్యేవేక్షకులు సునీల్ , భక్తులు తరించారు.
Also Read : KL Rahul : ఎన్సీఏలోనే కేఎల్ రాహుల్