Amit Shah Sidhu Family : అమిత్ షాను క‌లిసిన సిద్దూ పేరెంట్స్

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌తో విచార‌ణ జ‌రిపించాలి

Amit Shah Sidhu Family : ఇటీవ‌లే దారుణ హ‌త్య‌కు గురైన పంజాబీ సింగ‌ర్ సిద్దూ మూసే వాలా పేరెంట్స్ చండీగ‌ఢ్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను చండీగ‌ఢ్ ఎయిర్ పోర్ట్ లో శ‌నివారం క‌లిశారు.

సిద్దూ తండ్రి బ‌ల్కౌర్ సింగ్ త‌న కుమారుడి దారుణ హ‌త్య‌పై కేంద్ర సంస్థ‌ల‌తో విచార‌ణ జ‌రిపించాల‌ని విన్న‌వించారు. అంత‌కు ముందు కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ మాట్లాడుతూ గాయ‌కుడి హ‌త్య‌పై కేంద్ర ఏజెన్సీల‌తో విచ‌రాణ జ‌రిపించాల‌ని కోరుతూ మూసేవాలా కుటుంబం అమిత్ షాకు లేఖ రాసింద‌న్నారు.

హ‌ర్యానా లోని పంచ‌కుల‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను ప్రారంభించే ముందు అమిత్ షా ఇవాళ చండీగ‌ఢ్ లో పంజాబ్ బీజేపీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు.

ఇదిలా ఉండ‌గా భ‌గ‌వంత్ మాన్ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని 424 మంది ప్ర‌ముఖుల‌కు ఉన్న సెక్యూరిటీని తొల‌గించింది. ఆ వెంట‌నే సిద్దూ మూసే వాలాను ప్ర‌త్య‌ర్థులు మ‌ట్టు పెట్టారు.

ఈ ఘ‌ట‌న‌లో గుర్తు తెలియ‌ని దుండ‌గులు 32 సార్లు కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇటీవ‌ల రాష్ట్రంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిద్దూ మూసే వాలా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆయ‌న మాన్సా నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజ‌య్ సింగ్లా చేతిలో ఓడి పోయారు. ఈ త‌రుణంలో గ్యాంగ్ వార్ లో చోటు చేసుకున్న ఆధిప‌త్య పోరే ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పంజాబ్ పోలీస్ భావిస్తోంది.

ఇక సిద్దూపై దాడి చేసిన దుండ‌గులు స్నేహితుడు, బంధువు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కానీ సిద్దూ ఒక్క‌డే మ‌ర‌ణించాడు. మిగ‌తా వారు చికిత్స పొందుతున్నారు. ప్ర‌స్తుతం సిద్దూ పేరెంట్స్ అమిత్ షా(Amit Shah Sidhu Family) ను క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Also Read : కేంద్ర స‌ర్కార్ పై కేజ్రీవాల్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!