Sinha Babul Supriyo : లోక్ సభ , అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ నుంచి శతృఘ్న సిన్హా, గాయకుడు బాబుల్ సుప్రియోను అభ్యర్థులుగా వెల్లడించారు.
అసన్ సోల్ లోక్ సభ ఉప ఎన్నిక స్థానం నుంచి నటుడు శతృఘ్న సిన్హా పోటీ చేస్తుండగా గాయకుడిగా పేరొందిన బాబుల్ సుప్రియో (Sinha Babul Supriyo )ను బాలిగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఎంపిక చేసినట్లు చెప్పారు సీఎం.
ఇదిలా ఉండగా బాబుల్ సుప్రియో రెండు సార్లు భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా పని చేశారు. గత ఏడాది కాషాయ జెండాను వీడారు. టీఎంసీలో చేరారు. దీంతో అసన్స్ ల్ లోక్ సభ స్థానం ఖాళీ అయ్యింది.
ఇక దాదాపు రెండు దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీతో అనుబంధం ఉన్న నటుడు శతృఘ్న సిన్హా ఆ పార్టీ అధినాయకత్వంతో విభేదించారు. 2019లో టీఎంసీ పార్టీలో చేరారు.
దీంతో అటు నటుడు ఇటు గాయకుడు ఇద్దరూ బీజేపీ నుంచి వచ్చిన వారే కావడం విశేషం. వీరిద్దరూ తనను నమ్ముకుని పార్టీ కోసం పని చేశారంటూ ఈ మధ్యే ప్రకటించారు మమతా బెనర్జీ.
ఆనాడే వీరిద్దరికి దీదీ ఛాన్స్ ఇవ్వడం ఖాయమని తేలి పోయింది. ఇవాళ సిన్హా, సుప్రియోలకు పోటీ చేసే ఛాన్స్ ఇచ్చింది.
ఇక అసెంబ్లీతో పాటు నగర పాలక సంస్థల ఎన్నికల్లో , ఉప ఎన్నికల్లో సత్తా చాటుతూ వచ్చిన టీఎంసీకు వీరిద్దరి గెలుపు నల్లేరు మీద నడకేనని చెప్పక తప్పదు.
వీరిద్దరికీ ఓ విశేషం ఉంది. అదేమిటంటే ఇద్దరూ కేంద్ర మంత్రులుగా పని చేసిన వారే.
Also Read : మోదీ మోసం మళ్లీ రైతు ఉద్యమం