CV Anand : స్కెచ్ వేశారు గ్యాంగ్ రేప్ చేశారు – సీపీ

CV Anand :  దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్ అమ్నీషియా ప‌బ్ మైన‌ర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు ఎట్ట‌కేల‌కు కొలిక్కి వ‌చ్చింది.

ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుగా ఉన్న‌ట్లు గుర్తించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్(CV Anand) వెల్ల‌డించారు.

ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు ఆరోపించిన‌ట్లుగానే ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు కూడా ఇందులో ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు.

విచిత్రం ఏమిటంటే ఎమ్మెల్యేపై కేసు న‌మోదు చేయ‌డం విశేషం. ఇక వివ‌రాల‌లోకి వెళితే మైన‌ర్ బాలిక‌ను ఎలా ట్రాప్ చేశారు. ఎలా రేప్ చేశార‌నే దానిపై వివ‌రించారు సీపీ.

ఆమెను ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే ట్రాప్ చేసి, అఘాయిత్యానికి పాల్ప‌డ్డార‌ని తెలిపారు. ఇక ఆరుగురు నిందితుల్లో ఒక‌రు మాత్ర‌మే మేజ‌ర్ అని మిగ‌తా

వారంతా 18 ఏళ్ల లోపు వారని చెప్పారు.

మైన‌ర్ల వివ‌రాలు చ‌ట్టం ప్ర‌కారం బ‌య‌ట‌కు వెల్ల‌డించేందుకు వీలు లేద‌న్నారు సీపీ. మార్చి 28న ఈ వ్య‌వ‌హారం మొద‌లైంద‌న్నారు. బెంగ‌ళూరులో

ఉండే ఓ స్టూడెంట్ పార్టీ చేసుకోవాల‌ని డిసైడ్ అయ్యాడు.

హైద‌రాబాద్ లో ఉన్న ఫ్రెండ్స్ తో ప్లాన్ చేశాడు. అమ్నీషియా ప‌బ్ ఎంచుకున్నారు. రేట్ మాట్లాడుకున్నారు. ఏప్రిల్ లో పార్టీ గురించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారీ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఉస్మాన్ అలీ ఖాన్ అనే వ్య‌క్తి ద్వారా ప‌బ్ ను బుక్ చేశారు. మే 28న మ‌ధ్యాహ్నం బాధితురాలు ప‌బ్ కు వెళ్లింది. నిందితులు ముందుగానే ప్లాన్ వేసుకున్నారు. ఆమెను ట్రాప్ చేశారు.

అదే రోజు సాయంత్రం రోడ్డు నెంబ‌ర్ 44లో ఉన్న ఖాళీ ప్ర‌దేశంలో గ్యాంగ్ రేప్ కు పాల్ప‌డ్డార‌ని చెప్పారు సీపీ ఆనంద్(CV Anand). రేప్ చేశాక వ‌దిలి వేశారు. రాత్రి ఆ అమ్మాయి తండ్రికి ఫోన్ చేస్తే వ‌చ్చి తీసుకు వెళ్లాడు.

మెడ‌పై అక్క‌డ‌క్క‌డా గాట్లు ఉండ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారన్నారు. మే 31న పోక్సో యాక్ట్ ప్ర‌కారం జూబ్లీ హిల్స్ లో కేసు న‌మోదు చేశారు.

భ‌రోసా సెంట‌ర్ కు త‌ర‌లించాం. అక్క‌డ 4 గంట‌ల పాటు కౌన్సెలింగ్ ఇచ్చాక వివ‌రాలు ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు నిందితుల‌ను

గుర్తించి ప‌ట్టుకున్నామ‌న్నారు.

ఏ1 సాదుద్దీన్ తో పాటు మైన‌ర్ల‌ను జూన్ 2న గుర్తించాం. 3న మేజ‌ర్ ను అరెస్ట్ చేశాం. మొత్తం న‌లుగురిని అరెస్ట్ చేశామ‌న్నారు సీపీ. న‌గ‌రంలో ప‌బ్ ల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ కొన‌సాగుతుంద‌ని హెచ్చ‌రించారు.

Also Read : 1,433 పోస్టుల‌కు ఆర్థిక శాఖ క్లియ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!