Smita Sabharwal : పూల దండలు కాదు ఉరితాళ్లే కరెక్ట్
సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్
Smita Sabharwal : గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో పై సామూహిక అత్యాచారం, కుటుంబీకుల హత్యకు సంబంధించిన కేసులో 11 మంది దోషులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం పై దేశమంతటా భగ్గుమంటోంది.
వారిని ఉరి తీయాల్సిందేనంటూ డిమాండ్ పెరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా అన్ని వర్గాలకు చెందిన వారంతా నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నాయి.
ఈ చర్య దేశమంతటా తీవ్రమైన చర్చకు దారితీసింది. తాజాగా తెలంగాణ సీఎం వ్యక్తిగత కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్(Smita Sabharwal) సంచలనంగా మారారు.
ఆమె చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. గత మూడు రోజులుగా ఆమె బిల్కిస్ బానో(Bilkis Bano) కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా దారుణ హత్యలకు పాల్పడిన వాళ్లను కోర్టు శిక్షించింది.
జీవిత ఖైదు విధించింది. కానీ కాషాయ ప్రభుత్వం వారిని విడుదల చేయడం దారుణం. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్దం అంటూ నిప్పులు చెరిగారు స్మితా సబర్వాల్.
వారికి పూలదండలతో సన్మానాలు కాదు క్షమాభిక్షను వెంటనే రద్దు చేసి ఉరి శిక్ష విధించాలని దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టును కోరుతున్నానని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. స్మితా సబర్వాల్(Smita Sabharwal0 కు వేలాదిగా సపోర్ట్ చేస్తుండగా మరికొందరు ఆమె తన పరిమితులు దాటిందంటూ పేర్కొంటున్నారు.
ఒక మహిళగా, సివిల్ సర్వెంట్ గా ఈ వార్తను చూసి తాను నమ్మలేక పోయానని, అసలు ఈ దేశంలో ఏం జరుగుతోందంటూ ప్రశ్నించారు.
Also Read : న్యాయం జరగక పోతే నిరసన