Smriti Irani : న్యూఢిల్లీ – కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సంచలన కామెంట్స్ చేశారు. మహిళలకు ప్రతి నెల నెలా వచ్చే నెలసరి గురించి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రుతుస్రావం అన్నది వైకల్యం కానే కాదన్నారు. వీరికి పెయిడ్ లీవ్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రుతుస్రావం గురించి ఆందోళన పడాల్సిన పని లేదన్నారు.
Smriti Irani Comment
దీని పేరుతో సెలవులు కావాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు స్మృతీ ఇరానీ(Smriti Irani). ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం ఇచ్చారు కేంద్ర మంత్రి. రుతుస్రావం జరిగే సమయంలో మహిళలు ఇబ్బందులు పడతారని, వారికి అనుమతితో కూడిన సెలవులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ.
రాజ్యసభలో మనోజ్ కుమార్ ఈ సమస్యను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనికి సమాధానం ఇస్తూ మహిళలో నెలసరి అన్నది సహజ సిద్దంగా జరిగే ప్రక్రియ అని , దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి .
మహిళా ఉద్యోగులకు ఇచ్చే సెలవుల అంశంలో ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం దారుణమని పేర్కొన్నారు ఆర్జేడీ నేత.
Also Read : Revanth Reddy CM : శాసన సభ ఆదర్శ ప్రాయం కావాలి