Smriti Irani : నా కూతురు బార్ న‌డ‌ప‌డం లేదు – స్మృతీ

ఈసారి కూడా అమేథీలో రాహుల్ ఓట‌మి ఖాయం

Smriti Irani : కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. గోవాలో త‌న కూతురు రెస్టారెంట్ క‌మ్ బార్ నిర్వ‌హిస్తోంద‌ని, ఇందుకు సంబంధించి షోకాజ్ నోటీసు కూడా అందుకుంద‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఆమె ఖండించారు.

శ‌నివారం స్మృతీ ఇరానీ మీడియాతో మాట్లాడారు. ఆ బార్ తో ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీ నిన్న‌టి నుంచి స్మృతీ ఇరానీని టార్గెట్ చేసింది.

పొద్ద‌స్త‌మానం నీతులు వ‌ల్లించే స్మృతీ ఇరానీకి త‌న కూతురు దాకా వ‌స్తే మాత్రం ఆ విలువ‌లు వ‌ర్తించ‌వ‌ని పేర్కొంది. ముందు గోవాలో చ‌ని పోయిన వ్య‌క్తి పేరుతో ఎలా రిన్యూవ‌ల్ చేసుకుంటారంటూ ప్ర‌శ్నించింది.

దీంతో భార‌తీయ జ‌న‌తా పార్టీలో కాంగ్రెస్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. తీవ్ర దుమారానికి దారి తీసింది. దీంతో స్మృతీ ఇరానీ(Smriti Irani)  స్వ‌యంగా రంగంలోకి దిగారు. ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌న్నారు.

రాహుల్ గాంధీ త‌ల్లి దోపిడీపై మీడియా స‌మావేశాలు నిర్వ‌హించ‌డ‌మే త‌న కూతురు చేసిన త‌ప్పిద‌మ‌న్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ క‌లిసి రూ. 5,000 కోట్ల అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ ఆరోపించింది ఇరానీ.

త‌న కూతురు మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థిని అని, ఎలాంటి బార్ ను నిర్వ‌హించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇక వ‌చ్చే 2024లో గ‌నుక అమేథీలో త‌న‌తో పోటీ చేస్తే మ‌రోసారి రాహుల్ గాంధీ ఓడి పోవ‌డం ఖాయ‌మ‌ని జోస్యం చెప్పింది స్మృతీ ఇరానీ(Smriti Irani) .

త‌న కూతురు త‌ప్పు చేస్తే కోర్టు శిక్షిస్తుంద‌ని ఒక ప్ర‌శ్న‌కు జ‌వాబుగా చెప్పారు కేంద్ర మంత్రి.

Also Read : స్మృతీ ఇరానీ కూతురికి బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!