NV Ramana : పాలిటిక్స్ లోకి రావాల‌ని అనుకున్నా..కానీ

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ

NV Ramana : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. శ‌నివారం జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జ‌రిగిన స‌మావేశంలో ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌(NV Ramana).

ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం సీజేఐ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌కు దారి తీశాయి. తాను క్రియా శీల‌క రాజ‌కీయాల్లోకి రావాల‌ని అనుకున్నాన‌ని..కానీ అనుకోకుండా న్యాయ‌వాద వృత్తి లోకి రావాల్సి వ‌చ్చింద‌ని అన్నారు.

అయితే కాలం నాకు స‌హ‌క‌రించ లేదు. నేను క‌ష్ట‌ప‌డి చేసిన దాన్ని వ‌దులు కోవాల‌నే నిర్ణ‌యం అంత సుల‌భం కాద‌న్నార‌ను సీజేఐ. ఈ సంద‌ర్భంగా కేంద్ర స‌ర్కార్ పై ఒకింత అసహ‌నం వ్య‌క్తం చేశారు ఆయ‌న‌.

దేశంలో అత్య‌ధికంగా కేసులు ప‌రిష్కారం కాక పోవ‌డానికి ఖాళీలను భ‌ర్తీ చేయ‌క పోవ‌డం, మౌలిక స‌దుపాయాలను క‌ల్పించ‌క పోవ‌డ‌మేన‌ని పేర్కొన్నారు.

న్యాయ‌మూర్తుల జీవితాల‌పై త‌ప్పుడు క‌థ‌నాలు రాయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. అనేక సంద‌ర్భాల‌లో ధోర‌ణ‌ల‌కు దారి తీసే స‌మ‌స్య‌ల‌ను హైలెట్ చేశానని చెప్పారు.

విప‌రీత ధోర‌ణ‌లు మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు. ప‌దవీ విర‌మ‌ణ త‌ర్వాత జ‌డ్జీల భ‌ద్ర‌త‌పై సీజేఐ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇవాళ న్యాయ‌మూర్తుల‌పై భౌతిక దాడులు జ‌రుగుతున్నాయి.

ఇది ఆలోచించాల్సిన విష‌యం. రాజ‌కీయ నాయ‌కులు, బ్యూరోక్రాట్లు, పోలీసు అధికారులు, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు వారి ఉద్యోగాల సున్నిత‌త్వం కార‌ణంగా ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా భ‌ద్ర‌త క‌ల్పిస్తారు. కానీ న్యాయ‌మూర్తుల‌కు అలాంటి ర‌క్ష‌ణ ఉండ‌ద‌న్నారు.

Also Read : మీడియాపై సీజేఐ సంచ‌ల‌న కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!