Smriti Irani : స్కోర్ కార్డుపై స్మృతీ ఇరానీ ఫైర్
కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన మంత్రి
Smriti Irani : తన పనితీరుపై కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా స్కోర్ కార్డు పేరుతో కామెంట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. కాంగ్రెస్ పార్టీకి మహిళల పట్ల ఎంతటి గౌరవం ఉందో దీనిని బట్టి చూస్తే తెలుస్తుందన్నారు. శనివారం ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ప్రస్తావించాలే తప్పా ఇలా బహిరంగంగా చులకన చేస్తారా అంటూ మండిపడ్డారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ(Smriti Irani).
Smriti Irani Said
ఎవరి పాలనలో దేశం సుభిక్షంగా ఉందో తేలుతుందన్నారు. ఎవరి స్కోర్ ఎంతెంతో తెలుసు కోవాలంటే పార్లమెంట్ సాక్షిగా చర్చకు పెట్టాలని సూచించారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి.
స్త్రీలకు ప్రత్యేకించి స్కోర్ కార్డును ఉంచుకునే సామర్థ్యం చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుందన్నారు. ఉద్దేశ పూర్వక అజ్ఞానానికి సంబంధించిన సందర్బాలు చాలా కొద్ది మంది మాత్రమే ఎడ తెగకుండా ప్రదర్శిస్తారంటూ ఎద్దేవా చేశారు. అవినీతి, ఉద్దేశ పూర్వక అజ్ఞానం అంటూ మండిపడ్డారు ఇరానీ.
కాంగ్రెస్ పార్టీ , మిత్రపక్షాలు ఏలుతున్న రాష్ట్రాలలో పాలన ఎలా ఉందో ఆ పార్టీనే చెప్పాలని పేర్కొన్నారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు కేంద్ర మంత్రి సృతీ ఇరానీ.
Also Read : Janhvi Kapoor : జాన్వీ కపూర్ అందాల ఆరబోత