Smriti Irani George Soros : సోరోస్ కామెంట్స్ స్మృతీ సీరియస్
ఇది భారత డెమోక్రసీపై జరిగిన దాడి
Smriti Irani George Soros : కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ నిప్పులు చెరిగారు. భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్ లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల వల్ల ఇండియాలో ప్రజాస్వామ్య పునరుజ్జీవనం వస్తుందని ప్రముఖ ప్రపంచ వ్యాపార దిగ్గజం జార్జ్ సోరోస్ కామెంట్స్ చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించారు స్మృతీ ఇరానీ(Smriti Irani George Soros).
ఇదే సమయంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిగ్గదీసి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. భారత ప్రజాస్వామ్య ప్రక్రియల్లో జోక్యం చేసుకునే అవసరం ఎందుకు వచ్చిందని నిలదీశారు కేంద్ర మంత్రి.
ఇలాంటి విదేశీ శక్తులు తమ చేతికి చిక్కిన వ్యక్తులు అధికారంలో ఉండేలా ఇతర దేశాలలో ప్రభుత్వాలను పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ స్మృతీ ఇరానీ సంచలన ఆరోపణలు చేశారు. జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా భారత్ పట్ల తీవ్ర వ్యతిరేకతను కలిగి ఉన్నాయంటూ మండిపడ్డారు. ఇది మంచి ప్రక్రియ కాదని పేర్కొన్నారు.
ఏమైనా అభిప్రాయాలు చెప్పాలని అనుకుంటే చెప్ప వచ్చని కానీ దేశ సమగ్రతను, లేదా డెమోక్రసీని నీరుగార్చేలా వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ భారతీయులు ఎవరూ సహించ బోరంటూ హెచ్చరించారు స్మృతీ ఇరానీ.
గతంలో భారత దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవాలని చూసిన ప్రతి ఒక్కరికి భంగపాటు కలిగిందన్నారు. ఈ విపత్కర సమయంలో ప్రతి భారతీయుడు జార్జ్ సోరోస్ కు తగిన రీతిలో బుద్ది చెప్పాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. విచిత్రం ఏమిటంటే ఆయనను ఆర్థిక యుద్ద నేరస్థుడు అంటూ కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
Also Read : కర్ణాటక బడ్జెట్ లో రైతులకు పెద్దపీట