Smriti Irani : వాయ‌నాడ్ లో స్మృతి ఇరానీ టూర్

దుమారం రేపిన కేంద్ర మంత్రి ప‌ర్య‌ట‌న

Smriti Irani : రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వాయ‌నాడు లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) ప‌ర్య‌ట‌న తీవ్ర దుమారం రేపింది. రాజ‌కీయ వ‌ర్గాల‌లో అనేక స్థాయిల్లో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

రెండు రోజుల పాటు ఆమె టూర్ కొన‌సాగుతోంది. ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ నేపాల్ లో ఒక పార్టీకి హాజ‌రైన వీడియోపై కాంగ్రెస్ , భార‌తీయ జ‌న‌తా పార్టీకి మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది.

ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ బీరు బాటిళ్ల‌ను ఓపెన్ చేస్తున్న ఫోటోల‌ను షేర్ చేసింది. దీంతో మాట‌ల యుద్దం తారా స్థాయికి చేరింది.

గ‌తంలో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అమేథితో పాటు కేర‌ళ‌లోని వాయ‌నాడు నియోజ‌క‌వ‌ర్గంలో రాహుల్ గాంధీ పోటీ చేశారు. అమేథిలో ఓట‌మి పాలై వాయ‌నాడులో గాంధీ గెలుపొందారు.

కావాల‌ని స్మృతి ఇరానీ ప‌ర్య‌టిస్తోందంటూ, దీని వెనుక రాజ‌కీయం త‌ప్ప మ‌రొక‌టి లేద‌ని అంటోంది కాంగ్రెస్. కేంద్ర మ‌హిళా , శిశు అభివృద్ధి శాఖ మంత్రి చేసిన టూర్ అత్య‌ధిక ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

విచిత్రం ఏమిటంటే 2019 ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీని ఓడించింది స్మృతి ఇరానీ(Smriti Irani). దీంతో ఆమె ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా ప్ర‌చారం ల‌భించింది. మోస్ట్ పాపుల‌ర్ అయ్యారు ఇరానీ.

గ‌త కొన్ని త‌రాల నుంచి అమేథీ నియోజ‌క‌వ‌ర్గం గాంధీ ఫ్యామిలీకి కంచు కోట‌గా ఉంటూ వ‌చ్చింది. కానీ బీజేపీ నుంచి స్మృతి ఆ రికార్డును చెరిపి వేసింది. రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీని వ్య‌తిరేకంగా ప్ర‌యోగిస్తూ వ‌చ్చింది భార‌తీయ జ‌న‌తా పార్టీ.

 Also Read : దేశాన్ని బీజేపీ విభ‌జించి పాలిస్తోంది

Leave A Reply

Your Email Id will not be published!