Smriti Mandhana RCB : ఆర్సీబీ స్కిప్పర్ గా స్మృతి మంధాన
ప్రకటించిన టీమ్ మేనేజ్ మెంట్
Smriti Mandhana RCB : భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతీ మంధానను(Smriti Mandhana RCB) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా జట్టు స్కిప్పర్ గా నియమించింది. ఈ విషయాన్ని ఆర్సీబీ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఇటీవల బీసీసీఐ ఆధ్వర్యంలో ముంబై లో చేపట్టిన ఐపీఎల్ వేలం పాటలో అత్యధిక ధరకు అమ్ముడు పోయింది. ఏకంగా రూ. 3.40 కోట్లకు ఆర్సీబీ చేజిక్కించుకుంది. అంతే కాదు ఆర్సీబీ జట్టుకు మెంటార్ గా ప్రముఖ టెన్నిస్ స్టార్ , హైదరాబాద్ కు చెందిన సానియా మీర్జా ను నియమించింది.
ఒక రకంగా ఇది ఎవరూ ఊహించని సంచలన నిర్ణయం అని చెప్పక తప్పదు. మంధాన టీమిండియాకు ఓపెనర్ గా ఆడుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐసీసీ మహిళల టి20 వరల్డ్ కప్ లో ఆడుతోంది. ఈసారి జరిగే ఉమెన్ ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున ఆడనుంది మంధాన. మొత్తం 5 జట్లు పాల్గొననున్నాయి. మంధానను స్కిప్పర్ గా నియమించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్సీబీ(Smriti Mandhana RCB) మేనేజ్ మెంట్ చైర్మన్ ప్రత్మేశ్ మిశ్రా. మా జట్టులో స్మృతి మంధాన కీలకమైన క్రికెటర్.
ఆమె అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగి ఉంది. అందుకే ఆమెకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు . ఆర్సీబీని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు ప్రత్మేశ్ మిశ్రా. ఈ ప్రకటనపై స్మృతి మంధాన స్పందించింది. తనపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపింది. మంధాన 113 టి20 మ్యాచ్ లు ఆడింది. మొత్తం 2, 661 రన్స్ చేసింది.
Also Read : మార్చి 31 నుంచి ఐపీఎల్ సంబురం