Somu Veerraju : బాబు కామెంట్స్ సోము సీరియస్
టీడీపీ చీఫ్ తీరుపై బీజేపీ చీఫ్ ఆగ్రహం
Somu Veerraju : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారి పోతున్నాయి. నువ్వా నేనా అన్నంతగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవలే టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వంతో కలిసి వచ్చారు. అమిత్ షా తో భేటీ అయ్యారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం జోరందుకుంది.
మరో వైపు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తనను సీఎంను చేయండి అద్భుతమైన పాలన అందజేస్తానంటూ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు(Somu Veerraju) సంచలన కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు. ఆయన తన వైఖరిని మార్చు కోవాలని సూచించారు.
ప్రతీ విషయంలో కేంద్రాన్ని విమర్శించడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. ఆనాడు ప్రత్యేక హోదా వద్దని ఇప్పుడు తమపై బురద చల్లితే ఎలా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుతో తాము దేనికైనా చర్చకు సిద్దమని స్పష్టం చేశారు సోము వీర్రాజు. నోటాతో పోటీ పడే పార్టీ బీజేపీ అంటూ చులకన చేసి మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. తిరిగి ఎవరు ఎవరిని కలుస్తున్నారో ముందు చూసుకుని మాట్లాడాలని ఎద్దేవా చేశారు.
Also Read : PM Modi Contest : మోదీ పోటీపై తమిళనాడులో ఉత్కంఠ