Sonam Wangchuk : ల‌డ‌ఖ్ కోసం సోనమ్ వాంగ్ చుక్ దీక్ష

గ‌డ్డ క‌ట్టే చ‌లిలో వ‌ద్ద ఆందోళ‌న

Sonam Wangchuk : ప‌రిశ్ర‌మ‌ల కార‌ణంగా హిమ‌నీ న‌దాలు అంత‌రించి పోయే ప్ర‌మాదం ఉందంటూ హెచ్చ‌రించారు. ఇప్ప‌టికైనా మోదీ ప్ర‌భుత్వం స్పందించ‌క పోతే ల‌డ‌ఖ్ భ‌విష్య‌త్తులో ఉండ‌ద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ప్ర‌ముఖ సామాజిక వేత్త సోన‌మ్ వాంగ్ చుక్(Sonam Wangchuk) . జ‌న‌వ‌రి 26న గ‌ణతంత్ర దినోత్స‌వం రోజున గ‌డ్డ క‌ట్టే చ‌లిలో ల‌డ‌ఖ్ లో దీక్ష చేప‌ట్టారు.

ఆయ‌న చేప‌ట్టిన దీక్ష ఇవాల్టితో నాలుగో రోజుకు చేరింది. తాను చేప‌ట్టిన ఈ దీక్ష కేంద్ర స‌ర్కార్ లో, పాల‌కుల్లో మార్పు రావాల‌ని అందుకే నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలిపారు. సామాజిక వేదిక‌ల ద్వారా ఆయ‌న పోస్టులు షేర్ చేశారు. తాజాగా ఓ వీడియో కూడా విడుద‌ల చేశారు సోన‌మ్ వాంగ్ చుక్. ల‌డ‌ఖ్ ను కాపాడాలంటూ కోరుతున్నారు.

ఆయ‌న ఐదు రోజుల దీక్ష‌కు పిలుపునిచ్చారు. ఆయ‌న ఒక్క‌రే దీక్ష‌కు కూర్చున్నారు. వృత్తి రీత్యా ఇంజ‌నీర్. ఖ‌ర్జుంగ్లాకు వెళ్లేందుకు త‌నకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరారు. త‌న ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డిందంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా విడుద‌ల చేసిన వీడియోలో తాను చేప‌ట్టిన దీక్ష‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌ద్ద‌తు తెలుపాల‌ని కోరారు సోన‌మ్ వాంగ్ చుక్(Sonam Wangchuk) .

త‌న దీక్ష‌కు అపార‌మైన మ‌ద్ద‌తు ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. ల‌డ‌ఖ్ , హిమాల‌య హిమ‌నీ న‌దాలు , దాని జీవావ‌ర‌ణ శాస్త్రాన్ని ర‌క్షించేందుకు తాను చేయ‌గ‌లిగిన‌దంతా చేస్తున్నాన‌ని, ఇందు కోసం ఉప‌వాసం కూడా చేసిన‌ట్లు తెలిపారు సోన‌మ్ వాంగ్ చుక్. జ‌న‌వ‌రి 30తో త‌న నిర‌స‌న దీక్ష ముగుస్తుంది. ప్ర‌తి ఒక్క‌రు త‌న దీక్ష‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు.

Also Read : ప‌ద్మ అవార్డు గ్ర‌హీత‌లను చ‌ద‌వాలి

Leave A Reply

Your Email Id will not be published!