Sonia Gandhi : ఈడీ ముందుకు సోనియా వెళ్ల లేదా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకం
Kavitha Sonia Gandhi : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇప్పటికే మార్చి 11న ఈడీ ముందు విచారణకు హాజరైంది. 9 గంటల పాటు విచారణ చేపట్టింది. ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ తరుణంలో రోజు రోజుకు ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేమిటంటే అప్రూవర్ గా మారిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రన్ పిళ్లై నాకేం తెలియదంటూ చెప్పడంతో ఈడీ మరోసారి కస్టడీకి తీసుకుంది. ఇదే క్రమంలో ఆడిటర్ బుచ్చిబాబుకు ఈడీ నోటీసు ఇచ్చింది.
ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించింది ఈడీ. ఈనెల 16న మరోసారి విచారణకు రావాల్సిందిగా నోటీసు జారీ చేసింది. రేపు బుచ్చిబాబు, రామచంద్రన్ పిళ్లై , కవిత, మనీష్ సిసోడియాను కలిపి విచారించనున్నట్లు సమాచారం. ఉన్నట్టుండి తనకు ఈడీ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని తాను మహిళనని ఇలా విచారిస్తారా అంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఈడీ ముందు హాజరు కావాల్సిందేనంటూ స్పష్టం చేసింది. ఈ కేసును మార్చి 24న విచారణ చేపడతామని పేర్కొంది.
ఇదిలా ఉండగా రాజకీయ విశ్లేషకులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఆరోగ్యం బాగా లేక పోయినా ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఈడీ ముందుకు వెళ్లిందని ఇందుకు కవిత(Kavitha Sonia Gandhi) మినహాయింపు ఎలా ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆడిటర్ బుచ్చిబాబు, పిళ్లైని ఈడీ బుధవారం విచారిస్తోంది.
Also Read : ఈడీ విచారణ కవిత హాజరయ్యేనా